Krishna Janmashtami : ఘనంగా రెండోరోజు కృష్ణాష్టమి వేడుకలు.. ఆలయాల్లో సందడి
నంద్యాల జిల్లా చాగలమర్రిలో SSF, హిందూ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణుడికి, బలరాములకు 108 నదీజలాలతో అభిషేకం నిర్వహించారు. కోదండ రామాలయంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. హరేకృష్ణ మూమెంట్ వారి హిందూ ఐక్య వేదిక మేనేజర్ చైతన్య కృష్ణ దాస ఆధ్వర్యంలో శ్రీ కృష్ణునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు పంచి పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భరతనాట్యం కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పురవీధులలో శ్రీకృష్ణుని ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తదుపరి ఉట్టికొట్టే కార్యక్రమంలో స్థానిక యువకులు, విటిపిఎస్ ఉద్యోగులు, కొండపల్లి గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఎంతో కోలాహలంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు.శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. వేడుకలను పురస్కరించుకొని సత్యసాయి మహాసమాధిని ప్రత్యేక పూలు, నెమలి పించములతో అలంకరించారు. ప్రత్యేక విద్యుత్ దీప అలంకరణలతో సాయి కుల్వంత్ సభ మందిరం వెలిగిపోయింది. వేడుకల్లో పాల్గొనడానికి వేలాదిగా దేశ, విదేశీ భక్తులు తరలివచ్చి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. గోకులం నుండి గోవులను తీసుకొచ్చి ప్రసాదాలను అందించారు. సత్యసాయి విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
నంద్యాల జిల్లా చాగలమర్రిలో SSF, హిందూ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణుడికి, బలరాములకు 108 నదీజలాలతో అభిషేకం నిర్వహించారు. కోదండ రామాలయంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. హరేకృష్ణ మూమెంట్ వారి హిందూ ఐక్య వేదిక మేనేజర్ చైతన్య కృష్ణ దాస ఆధ్వర్యంలో శ్రీ కృష్ణునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు పంచి పెట్టారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భరతనాట్యం కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పురవీధులలో శ్రీకృష్ణుని ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తదుపరి ఉట్టికొట్టే కార్యక్రమంలో స్థానిక యువకులు, విటిపిఎస్ ఉద్యోగులు, కొండపల్లి గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఎంతో కోలాహలంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. వేడుకలను పురస్కరించుకొని సత్యసాయి మహాసమాధిని ప్రత్యేక పూలు, నెమలి పించములతో అలంకరించారు. ప్రత్యేక విద్యుత్ దీప అలంకరణలతో సాయి కుల్వంత్ సభ మందిరం వెలిగిపోయింది. వేడుకల్లో పాల్గొనడానికి వేలాదిగా దేశ, విదేశీ భక్తులు తరలివచ్చి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. గోకులం నుండి గోవులను తీసుకొచ్చి ప్రసాదాలను అందించారు. సత్యసాయి విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
What's Your Reaction?