Krishnashtam: వైభవంగా శ్రీ కృష్ణాష్టమి ముందస్తు వేడుకలు
తెలుగు రాష్ట్రాలలో పలు పాఠశాలల్లో సంబరాలు
హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. అలాంటి కృష్ణాష్టమిని తెలుగు రాష్ట్రాలలోని పలు పాఠశాలల్లో ఘనంగా జరుపుకున్నారు. బాల బాలికలు శ్రీ కృష్ణుడు, గోపికల వేషధారణతో సందడి చేశారు.
పెద్దకడబూరు గ్రామంలోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం హైస్కూల్ నందు శనివారం ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కరస్పాండెంట్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని చిన్నారులు శ్రీ కృష్ణుడు, గోపికల వేషధారణతో విశేషంగా ఆకట్టుకున్నారు. శ్రీ కృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులు ఉట్టి కొట్టేందుకు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మండపేట ఆలమూరు రోడ్లోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడు గోపికల వేషధారణలో అలరించారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వుట్టికొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణుడి వేషధారణలో చిన్నారి కృష్ణులు ఉట్టికొట్టే తీరు అందర్నీ అలరించింది.
హైదరాబాద్ లోని పలు పాఠశాలల్లో కూడా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు ఉట్టి కొట్టి సందడి చేశారు.
ఇక ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్వశాంతి హైస్కూల్ లో శనివారం శ్రీ కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ శ్రీనాథ్ రెడ్డి ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 మంది చిన్నారులు గోపికలు మరియు కృష్ణుని వేషంతో ఎంతో అద్భుతంగా నృత్య ప్రదర్శన చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కృష్ణాష్టమి పబ్లిక్ హాలిడే కావడంతో ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు రాధాకృష్ణుల వేషధారణలో చూపరులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. తదుపరి విద్యార్థులకు ఉట్టికొట్టే కార్యక్రమాలను నిర్వహించారు.
What's Your Reaction?