Kubera Poster : నాగార్జున బర్త్ డే.. ‘కుబేర’ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్
ఆరు పదులు దాటినా యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. బిగ్ బాస్ సీజన్8లోనూ ఆయన హోస్ట్ గా కనిపించనున్నారు. ఈ ఏడాది ‘నా సామి రంగ’ మూవీతో నాగార్జున అలరించిన సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ములు, ధనుష్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. గురువారం నాగార్జున బర్త్ డే సందర్భంగా మేకర్స్ ‘కుబేర’ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున రిలాక్స్, రీఫ్రెష్ మెంట్ మూడ్ లో కనిపిస్తున్నారు. అయితే,ఇందులో ఆయన క్యారెక్టర్ ఎలాంటి ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఎగ్జయింట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ రిలీజైన పోస్టర్ నాగ్ ఫ్యాన్స్ కు కొత్త జోష్ ను ఇచ్చింది. నాగార్జున ఎప్పటికీ మన్మథుడేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. కుబేరలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

What's Your Reaction?