Lady Aghori Srinivas: లేడీ అఘోరి -శ్రీనివాస్ అరెస్ట్... చీటింగ్ కేసులో ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్

Lady Aghori Srinivas: లేడీ అఘోరి -శ్రీనివాస్ అరెస్ట్... చీటింగ్ కేసులో ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్

Apr 22, 2025 - 22:13
Apr 22, 2025 - 22:29
 0  283
Lady Aghori Srinivas: లేడీ అఘోరి -శ్రీనివాస్ అరెస్ట్... చీటింగ్ కేసులో ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్

లేడీ అఘోరీ, వర్షిణి అరెస్ట్ ! లేడీ అఘోరీ, వర్షిణిలకు ఊహించని షాక్ తగిలింది. లేడీ అఘోరీ, వర్షిణిలను అరెస్ట్ చేశారు. చీటింగ్ కేసులో లేడీ అఘోరీని అరెస్ట్ చేశారు మోకిలా పోలీసులు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఫిర్యాదు నేపథ్యంలో లేడీ అఘోరీని అరెస్ట్ చేశారు. దింతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేశారు మోకిలా పోలీసులు. ఈ తరుణంలోనే ఉత్తరప్రదేశ్ ,మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో లేడీ అఘోరీని అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువస్తున్నారు మోకిలా పోలీసులు.

లేడీ అఘోరీతో పాటు ఇటీవల తను వివాహం చేసుకున్న వర్షిణిని కూడా నగరానికి తరలిస్తున్నారు పోలీసులు. ఇక ఈ అరెస్ట్ పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఏపీకి చెందిన వర్షిని... ఇటీవల లేడీ అఘోరీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వర్షిణి కుటుంబానికి ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా కేదార్నాథ్ తీసుకువెళ్లి పెళ్లి చేసుకుంది లేడీ అఘోరీ.

ఇక వాళ్ళ పెళ్లికి సంబంధించిన వీడియో మొన్నటి నుంచి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తమను ఎవరైనా అరెస్టు చేయాలని చూస్తే, ఆత్మహత్య చేసుకుంటామని కూడా ఈ జంట మొన్న ప్రకటించి ఓ సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసింది. కేదార్నాథ్ వెళ్ళిపోతున్నామని ఇకపై తెలుగు రాష్ట్రాలకు రాబోమని కూడా ప్రకటించారు. కానీ తాజాగా ఈ జంటను పోలీసులు అరెస్టు చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News