LOKESH: అన్న క్యాంటీన్లపై విష ప్రచారం
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేశ్... సైకో బ్యాచ్ పనే అని ఆగ్రహం
అన్న క్యాంటీన్లపై వైసీపీ విష ప్రచారం చేయడంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అంశంపై జగన్ పార్టీ విష ప్రచారం చేస్తోందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలేనని మండిపడ్డారు. విష ప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పని చేసిందని... సింక్‌లో ఉన్న ప్లేట్లు తీస్తుంటే వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యం ఉంటుందని... చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీశారని లోకేశ్ అన్నారు. అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్మటం కొనసాగిస్తూనే ఉన్నారని నారా లోకేశ్ పేర్కొన్నారు.
మరోవైపు తణుకు అన్న క్యాంటీన్‌లో శుభ్రత పాటించడం లేదన్న ప్రచారంపై ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ ఆరా తీశారు. హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు, అధికారులు నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్లేట్లను మురికినీటిలో కడుతున్నారనేది పూర్తిగా అవాస్తవమని అధికారులు మంత్రికి తెలిపారు. వాష్ బేసిన్‌లోని ప్లేట్లు తీస్తుంటే వీడియో తీసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎక్కువమంది రావడంతో డస్ట్ బిన్‌కు బదులుగా వాష్ బేసిన్‌లో పెట్టారని అధికారులు వివరించారు. సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వాస్తవం కాదని స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్లలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు మంత్రికి తెలిపారు.
మరో శుభవార్త
రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు మరో గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో మరి కొన్ని అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం 100 అన్న క్యాంటీన్లను తొలి విడతలో భాగంగా మరలా ప్రారంభించింది. ప్రస్తుతం వీటిలో రూ.5లకే భోజనం పెడుతున్నారు.అయితే రెండో విడతలో భాగంగా రాష్ట్రంలో 75 అన్న క్యాంటీన్లను రీస్టార్ట్ చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. వచ్చే నెల (సెప్టెంబరు) 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మరో 75 అన్న క్యాంటీన్లను స్టార్ట్ చేయనున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఆగస్ట్ 15వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించగా.. మరుసటి రోజు రాష్ట్రవ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు.ఈ అన్న క్యాంటీన్ల ద్వారా ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు బ్రేక్ ఫాస్ట్.. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు భోజనం.. అలాగే రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు డిన్నర్ ఐదు రూపాయల చొప్పున అందిస్తున్నారు.
What's Your Reaction?