Maharashtra : మహారాష్ట్రలో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం

నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని రత్నగిరిలో జరిగింది. రత్నగిరిలో నర్సింగ్ విద్యార్థిని(20) క్లాసులకు హాజరైన తర్వాత ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కింది. ఆమెతో మాటలు కలిపిన డ్రైవర్‌ తాగడానికి నీళ్లు ఇచ్చాడు. అప్పటికే అందులో అతడు మత్తుమందు కలపడంతో యువతి స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెను ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లిన డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో, అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కొంత సేపటికి స్పృహ రావడంతో తనపై లైంగిక దాడి జరిగినట్లుగా గుర్తించిన బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని త్వరగా అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బాధితురాలి బంధువులు, స్థానికులు, డాక్టర్లు, నర్సులు అర్ధరాత్రి రోడ్డుపై పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Aug 28, 2024 - 17:07
 0  4

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News