Mahesh Babu : మహేష్ బాబేంటీ.. ఇలా మారిపోయాడు
ఆర్టిస్టులకు సొంత మొహాలు తక్కువ. ఎక్కువగా వారి పాత్రలే మొహాలుగా కనిపిస్తుంటాయి. స్టార్ హీరోలకు ఈ బాధ కాస్త తక్కువే. బట్.. రాజమౌళి లాంటి డైరెక్టర్ చేతిలో పడ్డప్పుడు వీళ్లూ తమ మొహాలను మర్చిపోవాల్సిందే. ఆ రేంజ్ లో ఉంటాయి మేకోవర్స్. మొదట్లో లేదు కానీ.. బాహుబలి నుంచి రాజమౌళి ఇదే చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఇండియన్ సినిమా ఫ్లాగ్ ను ఎగరేసిన జక్కన్న ఇప్పుడు మహేష్ బాబుతో మూవీకి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకూ మన తెరపై చూడనంత యాక్షన్ ఎంటర్టైనర్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు అనే టాక్ ఇప్పటికే ఉంది. అందుకే మహేష్ లుక్ ను కూడా పూర్తిగా మార్చేయమన్నట్టున్నాడు. అప్పటి నుంచి విపరీతంగా హెయిర్ పెంచుతున్నాడు సూపర్ స్టార్.కొన్ని రోజుల క్రితం కాస్త గడ్డం, లాంగ్ హెయిర్ తో కొత్తగా కనిపించాడు మహేష్. అయితే అతని లేటెస్ట్ పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఎందుకంటే ఇందులో అసలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఇంత పెద్ద మీసాలతో అతను ఏ సినిమాలోనూ కనిపించలేదు. గడ్డం కూడా బాగా పెరిగింది. తల వెంట్రుకలను క్యాప్ తో కవర్ చేసినా.. వెనక జాలువారేలా ఉంది జుత్తు. సడెన్ గా చూస్తే మహేష్ బాబు అని గుర్తించడం కష్టం అన్నంతగా మారిపోయాడు బాబు. మరి ఇదే లుక్ రాజమౌళి సినిమాలోనూ కనిపిస్తుందా. లేక అతని సినిమాల్లో ఎప్పుడూ ఫ్లాష్ బ్యాక్ టైమ్ లో ఈ గెటప్ ఉంటుందా అనేది సినిమా వస్తే కానీ చెప్పలేం.. అలాగే ఆ సినిమా ఎప్పుడు వస్తుందో కూడా.
ఆర్టిస్టులకు సొంత మొహాలు తక్కువ. ఎక్కువగా వారి పాత్రలే మొహాలుగా కనిపిస్తుంటాయి. స్టార్ హీరోలకు ఈ బాధ కాస్త తక్కువే. బట్.. రాజమౌళి లాంటి డైరెక్టర్ చేతిలో పడ్డప్పుడు వీళ్లూ తమ మొహాలను మర్చిపోవాల్సిందే. ఆ రేంజ్ లో ఉంటాయి మేకోవర్స్. మొదట్లో లేదు కానీ.. బాహుబలి నుంచి రాజమౌళి ఇదే చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఇండియన్ సినిమా ఫ్లాగ్ ను ఎగరేసిన జక్కన్న ఇప్పుడు మహేష్ బాబుతో మూవీకి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకూ మన తెరపై చూడనంత యాక్షన్ ఎంటర్టైనర్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు అనే టాక్ ఇప్పటికే ఉంది. అందుకే మహేష్ లుక్ ను కూడా పూర్తిగా మార్చేయమన్నట్టున్నాడు. అప్పటి నుంచి విపరీతంగా హెయిర్ పెంచుతున్నాడు సూపర్ స్టార్.
కొన్ని రోజుల క్రితం కాస్త గడ్డం, లాంగ్ హెయిర్ తో కొత్తగా కనిపించాడు మహేష్. అయితే అతని లేటెస్ట్ పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఎందుకంటే ఇందులో అసలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఇంత పెద్ద మీసాలతో అతను ఏ సినిమాలోనూ కనిపించలేదు. గడ్డం కూడా బాగా పెరిగింది. తల వెంట్రుకలను క్యాప్ తో కవర్ చేసినా.. వెనక జాలువారేలా ఉంది జుత్తు. సడెన్ గా చూస్తే మహేష్ బాబు అని గుర్తించడం కష్టం అన్నంతగా మారిపోయాడు బాబు. మరి ఇదే లుక్ రాజమౌళి సినిమాలోనూ కనిపిస్తుందా. లేక అతని సినిమాల్లో ఎప్పుడూ ఫ్లాష్ బ్యాక్ టైమ్ లో ఈ గెటప్ ఉంటుందా అనేది సినిమా వస్తే కానీ చెప్పలేం.. అలాగే ఆ సినిమా ఎప్పుడు వస్తుందో కూడా.
What's Your Reaction?