Mahesh Babu : హాలీవుడ్ సినిమాకు మహేశ్ డబ్బింగ్

హాలీవుడ్ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న 'ముఫాసా: ది లయన్ కింగ్ ' సినిమాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు డబ్బింగ్ చెప్పనున్నారు. ఈ సినిమాలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20న దీనిని విడుదల చేయనున్నారు. ముఫాసా పాత్ర తెలుగు వెర్షన్కు మహేశ్ బాబు డబ్బింగ్ చెబుతారని తెలిపింది. ఈ మూవీ తెలుగు ట్రైలర్ ఈనెల 26న విడుదల చేయనున్నారు. 'డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తాను. డిసెంబర్ 20న తెలుగులో 'ముఫాసా: ది లయన్ కింగ్ 'ను బిగ్ స్క్రీన్పై నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’అంటూ ఆనందం వ్యక్తంచేశారు. ఇక దీని హిందీ ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు అబ్రం (షారుక్ చిన్న కుమారుడు) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక పాత్రకు షారుక్ ఖాన్, సింబా పాత్రకు షారుక్ పెద్ద తనయుడు ఆర్యన్ ఖాన్ వాయిస్ ఇచ్చారు.

Aug 23, 2024 - 11:16
 0  2

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News