Mahindra Thar Roxx – Maruti Jimny | ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీలు.. మహీంద్రా థార్ రాక్స్.. మారుతి జిమ్నీల్లో ఏది బెస్ట్.. !
Mahindra Thar Roxx - Maruti Jimny | ఆఫ్ రోడ్ ఎస్ యూవీ కార్లలో మారుతి సుజుకి జిమ్నీ, మహీంద్రా అండ్ మహీంద్రా థార్ రాక్స్ పోటీ పడుతున్నాయి.
Mahindra Thar Roxx – Maruti Jimny | దేశీయ కార్ల మార్కెట్లో ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ లో పాపులర్ కార్లు మారుతి జిమ్నీ.., మహీంద్రా థార్.. మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే 3-డోర్ థార్ స్థానే 5-డోర్ థార్ రాక్స్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మారుతి సుజుకి జిమ్నీ సైతం 5-డోర్ ఆఫ్ రోడ్ ఎస్ యూవీగా మార్కెట్ లో పాపులర్. ఈ రెండు కార్లలో సారూప్యతలు, ధర వరలు, టెక్నాలజీ ఫీచర్లలో తేడాలపై ఓ లుక్కేద్దామా..!
ఇటీవలే భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన మహీంద్రా అండ్ మహీంద్రా 5-డోర్ థార్ రాక్స్ కారు పెట్రోల్ (2.0 లీటర్ల టీజీడీఐ ఎంస్టాలియన్), డీజిల్ (2.2 లీటర్ల ఎంహవాక్) ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 152 పీఎస్ విద్యుత్/ 330 ఎన్ఎం టార్క్, 162 పీఎస్ విద్యుత్ / 330 ఎన్ఎం టార్క్, 177 పీఎస్ విద్యుత్/ 380 ఎన్ఎం టార్క్, డీజిల్ వేరియంట్ 152 పీఎస్ విద్యుత్ 330 ఎన్ఎం టార్క్/ 175 పీఎస్ విద్యుత్ 370 ఎన్ఎం టార్క్ వెలువరిస్తాయి. పెట్రోల్, డీజిల్ వేరియంట్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్లలో లభిస్తుంది.
మారుతి సుజుకి జిమ్నీ గ్యాసోలిన్ ఇంజిన్ ఆప్షన్ లో మాత్రమే లభిస్తుంది. ఈ కారు కే15బీ 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ (105 పీఎస్ విద్యుత్, 134 ఎన్ఎం టార్క్) వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. మహీంద్రా థార్ రాక్స్ ‘ఆర్‌డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ’ ఆప్షన్లలో లభిస్తే, మారుతి సుజుకి జిమ్నీ 3డబ్ల్యూడీ (ఆల్ గ్రిప్ ప్రో) వర్షన్ లో అందుబాటులో ఉంటుంది.
మహీంద్రా అండ్ మహీంద్రా థార్ రాక్స్ ప్రస్తుతం ఆర్ డబ్ల్యూడీ వర్షన్ లో మాత్రమే లభిస్తుంది. మహీంద్రా థార్ రాక్స్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.12.99 లక్షల నుంచి రూ.19.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. థార్ రాక్స్ డీజిల్ వర్షన్ కారు ధర రూ.13.99 లక్షల నుంచి రూ.20.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర లభిస్తుంది. అక్టోబర్ మూడో తేదీన బుకింగ్స్ ప్రారంభం కానున్న థార్ రాక్స్ 4డబ్ల్యూడీ కార్ల ధరలు త్వరలో ప్రకటిస్తారు. ఇక మారుతి సుజుకి జిమ్నీ కారు ధర రూ.12.74 లక్షల నుంచి రూ.14.95 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది.
What's Your Reaction?