Malavika Mohanan : ఈ హాట్ బ్యూటీ అక్కడైనా హిట్ అవుతుందా..
కొందరు హీరోయిన్లకు అన్నీ ఉంటాయి. ఒక్క అదృష్టం తప్ప. అలాంటి వారు ఈ మధ్య చాలామందే ఉన్నారు. అందం, అది ప్రదర్శించేందుకు అభ్యంతరం లేకపోవడం.. వీటికి తోడు నటనా తెలిసి ఉండటం అనే క్వాలిఫికేషన్స్ లో చాలా హాట్ అనిపించుకున్న బ్యూటీ మాళవిక మోహనన్. 2013లోనే మాలీవుడ్ కు పరిచయమైన ఈ మల్లూ సోయగం.. ఆ తర్వాత కన్నడ, తమిళ్, హిందీ మూవీస్ లోనూ నటించింది. కానీ ఎక్కడా జెండా ఎగరేయలేకపోయింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాను తన ఘాటైన సోయగాలతో హీటెక్కిస్తూ వస్తోంది. కానీ అందుకు భిన్నమైన పాత్రలో తంగలాన్ లో కనిపించింది. ఆరతి అనే పాత్రలో తన నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. తమిళ్ లో విజయ్ తో మాస్టర్, ధనుష్ తో మారన్ అనే హిట్ మూవీస్ చేసినా తన రేంజ్ మారలేదు. ఇక ఇన్నాళ్లకు తనకు సరైన మూవీ పడబోతోంది అనేలా ప్రభాస్ తో రాజా సాబ్ చేస్తోంది. కాకపోతే ఈ మూవీలో తనతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లున్నారు. 2017లో బియాండ్ ద క్లౌడ్స్ అనే మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తన నటనకు ప్రశంసలు వచ్చాయి. సినిమా పోయింది. దీంతో అక్కడా కొత్త ఆఫర్స్ రాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది హాటీ.‘యుధ్ర’ అనే మూవీతో మరోసారి హిందీలో తన లక్ చెక్ చేసుకోబోతోంది. సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని రవి ఉద్యావర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ గురువారం ట్రైలర్ విడుదలవుతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తుంటే.. ఈ సారి బాలీవుడ్ ను తనవైపు తిప్పుకునేలానే ఉంది. ఆ ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి మాళవికలో. అందుకే ఆ మేరకు తన వంతుగా ప్రదర్శన చేయబోతోంది అనిపిస్తోంది. ఈ పోస్టర్స్ ను బట్టి ఇదో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. మరి ఈ మూవీతో అయినా అమ్మడి కెరీర్ ఒక భాషలో సెట్ అవుతుందో లేదో కానీ.. మాళవిక మాత్రం యుధ్రపై చాలా నమ్మకమే పెట్టుకుంది. ఆ నమ్మకం నిజం అవుతుందా లేదా అనేది సెప్టెంబర్ 20న తెలుస్తుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అదే.
కొందరు హీరోయిన్లకు అన్నీ ఉంటాయి. ఒక్క అదృష్టం తప్ప. అలాంటి వారు ఈ మధ్య చాలామందే ఉన్నారు. అందం, అది ప్రదర్శించేందుకు అభ్యంతరం లేకపోవడం.. వీటికి తోడు నటనా తెలిసి ఉండటం అనే క్వాలిఫికేషన్స్ లో చాలా హాట్ అనిపించుకున్న బ్యూటీ మాళవిక మోహనన్. 2013లోనే మాలీవుడ్ కు పరిచయమైన ఈ మల్లూ సోయగం.. ఆ తర్వాత కన్నడ, తమిళ్, హిందీ మూవీస్ లోనూ నటించింది. కానీ ఎక్కడా జెండా ఎగరేయలేకపోయింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాను తన ఘాటైన సోయగాలతో హీటెక్కిస్తూ వస్తోంది. కానీ అందుకు భిన్నమైన పాత్రలో తంగలాన్ లో కనిపించింది. ఆరతి అనే పాత్రలో తన నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. తమిళ్ లో విజయ్ తో మాస్టర్, ధనుష్ తో మారన్ అనే హిట్ మూవీస్ చేసినా తన రేంజ్ మారలేదు. ఇక ఇన్నాళ్లకు తనకు సరైన మూవీ పడబోతోంది అనేలా ప్రభాస్ తో రాజా సాబ్ చేస్తోంది. కాకపోతే ఈ మూవీలో తనతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లున్నారు. 2017లో బియాండ్ ద క్లౌడ్స్ అనే మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తన నటనకు ప్రశంసలు వచ్చాయి. సినిమా పోయింది. దీంతో అక్కడా కొత్త ఆఫర్స్ రాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది హాటీ.
‘యుధ్ర’ అనే మూవీతో మరోసారి హిందీలో తన లక్ చెక్ చేసుకోబోతోంది. సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని రవి ఉద్యావర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ గురువారం ట్రైలర్ విడుదలవుతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తుంటే.. ఈ సారి బాలీవుడ్ ను తనవైపు తిప్పుకునేలానే ఉంది. ఆ ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి మాళవికలో. అందుకే ఆ మేరకు తన వంతుగా ప్రదర్శన చేయబోతోంది అనిపిస్తోంది. ఈ పోస్టర్స్ ను బట్టి ఇదో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. మరి ఈ మూవీతో అయినా అమ్మడి కెరీర్ ఒక భాషలో సెట్ అవుతుందో లేదో కానీ.. మాళవిక మాత్రం యుధ్రపై చాలా నమ్మకమే పెట్టుకుంది. ఆ నమ్మకం నిజం అవుతుందా లేదా అనేది సెప్టెంబర్ 20న తెలుస్తుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అదే.
What's Your Reaction?