Mamata Banerjee : సీఎం పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయాలి : స్టూడెంట్ల ర్యాలీ
పశ్చిమ బెంగాల్ లో జూనియర్ డాక్టర్ పై అత్యాచార ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం మమతాబెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘం ‘పశ్చిమబంగా ఛాత్ర సమాజ్’ మంగళవారం నిరసన చేపట్టింది. ‘నబన్నా (సెక్రటేరియట్) అభిజన్’ పేరుతో హావ్‌డా నుంచి విద్యార్థులు ర్యాలీని ప్రారంభించారు. అయితే, వీరిని పోలీసులు అడ్డుకోవడంతో హావ్‌డాలోని సంతర్గాచి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మార్చ్‌లో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్లను బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. కొన్నింటిని లాగి పడేశారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు వీరిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ర్యాలీ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళన నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఎలాంటి అభ్యర్థన రాలేదని పోలీసులు తెలిపారు.ఈ మార్చ్ జరిగే సమయంలో హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. ఆ విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో అదృశ్యమయ్యారని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. విద్యార్థులు మిస్ అయ్యారంటూ కొందరు రాజకీయ నేతలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని బెంగాల్ పోలీసులు ‘ఎక్’ వేదికగా స్పందించారు. ఎవరూ అదృశ్యం కాలేదన్నది నిజమని తెలిపారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కోల్‌కతా పోలీసు విభాగం 6 వేలమందిని మోహరించింది. అలాగే ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు అప్పగించింది. హేస్టింగ్స్‌లోని ఫోర్ట్ విలియం గేట్లకు సివిక్ వలంటీర్లు గ్రీజ్ పూసిన దృశ్యాలు మీడియాలో వెలుగులోకి వచ్చాయి. నిరసనకారుల్ని అడ్డుకునేందుకు అధికారులు ఈ విధంగా చేశారు. ఈ మార్చ్ నేపథ్యంలో ప్రజాజీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్ లో జూనియర్ డాక్టర్ పై అత్యాచార ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం మమతాబెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘం ‘పశ్చిమబంగా ఛాత్ర సమాజ్’ మంగళవారం నిరసన చేపట్టింది. ‘నబన్నా (సెక్రటేరియట్) అభిజన్’ పేరుతో హావ్‌డా నుంచి విద్యార్థులు ర్యాలీని ప్రారంభించారు. అయితే, వీరిని పోలీసులు అడ్డుకోవడంతో హావ్‌డాలోని సంతర్గాచి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మార్చ్‌లో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్లను బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. కొన్నింటిని లాగి పడేశారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు వీరిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ర్యాలీ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళన నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఎలాంటి అభ్యర్థన రాలేదని పోలీసులు తెలిపారు.
ఈ మార్చ్ జరిగే సమయంలో హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. ఆ విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో అదృశ్యమయ్యారని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. విద్యార్థులు మిస్ అయ్యారంటూ కొందరు రాజకీయ నేతలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని బెంగాల్ పోలీసులు ‘ఎక్’ వేదికగా స్పందించారు. ఎవరూ అదృశ్యం కాలేదన్నది నిజమని తెలిపారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కోల్‌కతా పోలీసు విభాగం 6 వేలమందిని మోహరించింది. అలాగే ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు అప్పగించింది. హేస్టింగ్స్‌లోని ఫోర్ట్ విలియం గేట్లకు సివిక్ వలంటీర్లు గ్రీజ్ పూసిన దృశ్యాలు మీడియాలో వెలుగులోకి వచ్చాయి. నిరసనకారుల్ని అడ్డుకునేందుకు అధికారులు ఈ విధంగా చేశారు. ఈ మార్చ్ నేపథ్యంలో ప్రజాజీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.
What's Your Reaction?