Manu Bhaker : నా ఫేవరేట్ క్రికెటర్లు ఆ ముగ్గురే : మను బాకర్

పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన మను బాకర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన కెరీర్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటోంది. తాజాగా క్రికెట్‌లో తనకు ఇష్టమైన ముగ్గురు క్రికెటర్ల పేర్లను తెలిపిన మను.. వారితో మాట్లాడుతూ సమయం గడిపితే బాగుంటుదని పేర్కొంది. ‘నాకు చాలా మంది క్రీడాకారులు ఇష్టం. అందులో కొందరి పేర్లే చెబుతా. జమైకా స్టార్‌ రన్నర్ ఉసేన్ బోల్ట్ నా ఫేవరెట్‌ అథ్లెట్. అతడి జీవిత చరిత్ర పుస్తకం కూడా చదివా. బోల్ట్ ప్రయాణం ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుంది. చాలా ఇంటర్వ్యూలు చూశా. ఇక భారత్‌లో నాకు ముగ్గురు క్రికెటర్లు ఫేవరెట్. సచిన్, ధోనీ, విరాట్ కోహ్లీ. వారితో ఒక్క గంట పాటు మాట్లాడినా ఎంతో గౌరవంగా ఉంటుంది. ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని మను తెలిపింది. 2028లో లాస్ ఏజెంల్స్ లో జరగబోయే ఒలింపిక్స్ లో గోల్డ్ సాధించడంపైనే ఫోకస్ పెట్టినట్లు మను బాకర్ తెలిపింది. ‘క్రీడాకారిణిగా భారత్‌ కోసం నావంతు భాగస్వామ్యం ఉండాలనేది నా కోరిక. ఒలింపిక్స్‌ లేదా ఇతర ఈవెంట్లలో మన దేశం మరిన్ని పతకాలు గెలిస్తే చూడాలనుంది. అందుకోసం కృషి చేస్తూనే ఉంటా. కొత్తగా వచ్చే అథ్లెట్లకు నా అనుభవాలు చెబుతా. అలా చేయడం నాకిష్టం’ అని వెల్లడించింది.

Aug 26, 2024 - 20:05
 0  1

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News