Maruti Nagar Subrahmanyam : మారుతి నగర్ సుబ్రహ్మణ్యంకు షాకింగ్ కలెక్షన్స్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్ష వర్ధన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ప్రధాన విశేషం ఏంటంటే.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సమర్పించిన సినిమా కావడం. లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేశాడు. విడుదలకు ముందు చాలానే హడావిడీ చేశారు. ట్రైలర్ చూస్తే కంప్లీట్ ఎంటర్టైనర్ అనిపించింది. దీనికి తోడు అల్లు అర్జున్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకువచ్చి మరీ ప్రమోషన్స్ చేయించారు. అఫ్ కోర్స్ అతను సినిమా గురించి కంటే తన గురించే ఎక్కువగా చెప్పుకున్నాడు అది వేరే విషయం.ఇక ఈ శుక్రవారం విడుదలైన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మినిమం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సాధించిన కలెక్షన్స్ చూసి నిర్మాతలు లబోదిబో అంటున్నారట. అంత దారుణమై కలెక్షన్స్ తో పూర్ మూవీగా తేలిపోయింది. ఇంత దారుణమైన కలెక్షన్స్ ఈ మధ్య కాలంలో వేరే ఏ సినిమాకూ రాలేదు అంటున్నారు కొన్నవాళ్లంతా. నిజానికి మూవీ బోరింగ్ గానే ఉంటుంది. ఏవో కొన్ని సన్నివేశాల్లో తప్ప ఎక్కడా నవ్వు రప్పించే సీన్స్ ఉండవు. ఒక దశ దాటిన తర్వాత రావు రమేష్ ‘అతి’ని భరించలేకపోతారు. ఒకే ఇంట్లో సాగే సినిమాగా చూపించడం మరింత బోర్ అనిపిస్తుంది. ఏ మాత్రం కొత్తదనం లేని కథనంతో దర్శకుడు పూర్తిగా గాడి తప్పినట్టు అనిపిస్తుంది. అతను ఎంచుకున్న 1998 టీచర్ పోస్ట్ ల పాయింట్ బావుంది. కానీ ఎగ్జిక్యూషన్ లోపంగా కనిపిస్తుంది. కేవలం రావు రమేష్ నే నమ్ముకోవడం అసలుకే ఎసరు తెచ్చిందంటున్నారు చూసినవాళ్లంతా. సో.. కథలో దమ్ము.. కథనంలో నవ్యత లేకపోతే సుకుమార్ వచ్చినా.. అల్లు అర్జున్ వచ్చినా ఉపయోగం ఉండదు అని మరోసారి తేలిపోయింది.  

Aug 24, 2024 - 18:22
 0  0
Maruti Nagar Subrahmanyam : 
మారుతి నగర్ సుబ్రహ్మణ్యంకు షాకింగ్ కలెక్షన్స్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్ష వర్ధన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ప్రధాన విశేషం ఏంటంటే.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సమర్పించిన సినిమా కావడం. లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేశాడు. విడుదలకు ముందు చాలానే హడావిడీ చేశారు. ట్రైలర్ చూస్తే కంప్లీట్ ఎంటర్టైనర్ అనిపించింది. దీనికి తోడు అల్లు అర్జున్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకువచ్చి మరీ ప్రమోషన్స్ చేయించారు. అఫ్ కోర్స్ అతను సినిమా గురించి కంటే తన గురించే ఎక్కువగా చెప్పుకున్నాడు అది వేరే విషయం.

ఇక ఈ శుక్రవారం విడుదలైన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మినిమం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సాధించిన కలెక్షన్స్ చూసి నిర్మాతలు లబోదిబో అంటున్నారట. అంత దారుణమై కలెక్షన్స్ తో పూర్ మూవీగా తేలిపోయింది. ఇంత దారుణమైన కలెక్షన్స్ ఈ మధ్య కాలంలో వేరే ఏ సినిమాకూ రాలేదు అంటున్నారు కొన్నవాళ్లంతా.

నిజానికి మూవీ బోరింగ్ గానే ఉంటుంది. ఏవో కొన్ని సన్నివేశాల్లో తప్ప ఎక్కడా నవ్వు రప్పించే సీన్స్ ఉండవు. ఒక దశ దాటిన తర్వాత రావు రమేష్ ‘అతి’ని భరించలేకపోతారు. ఒకే ఇంట్లో సాగే సినిమాగా చూపించడం మరింత బోర్ అనిపిస్తుంది. ఏ మాత్రం కొత్తదనం లేని కథనంతో దర్శకుడు పూర్తిగా గాడి తప్పినట్టు అనిపిస్తుంది. అతను ఎంచుకున్న 1998 టీచర్ పోస్ట్ ల పాయింట్ బావుంది. కానీ ఎగ్జిక్యూషన్ లోపంగా కనిపిస్తుంది. కేవలం రావు రమేష్ నే నమ్ముకోవడం అసలుకే ఎసరు తెచ్చిందంటున్నారు చూసినవాళ్లంతా.

సో.. కథలో దమ్ము.. కథనంలో నవ్యత లేకపోతే సుకుమార్ వచ్చినా.. అల్లు అర్జున్ వచ్చినా ఉపయోగం ఉండదు అని మరోసారి తేలిపోయింది.  

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News