Meenakshi Chaudhary : మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి
టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ముందు వరసలో ఉంది. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ‘ఇచట వాహనములు నిలపరాదు’ సినిమాతో మీనాక్షి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఖిలాడి, హిట్2 సినిమాల్లో నటించి తక్కువ టైమ్ లోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ ఏడాది ‘గుంటూరు కారం’లో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో మట్కా, దుల్కర్ సల్మాన్ తో ‘లక్కీ బాస్కర్’, విశ్వక్సేన్ తో ‘మెకానిక్ రాకీ’లో నటిస్తోంది. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’లోనూ ఈ అమ్మడు చాన్స్ కొట్టేసింది. ప్రస్తుత టాలీవుడ్ లో నాలుగు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్ మీనాక్షినే కావడం గమనార్హం. కోలీవుడ్ లోనూ ఈ బ్యూటీ బిజీగా మారింది. ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్ తో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే నెల 5న రిలీజ్ కానుంది. ఇండస్ట్రీకి వచ్చిన మూడేళ్లలోనే టాప్ హీరోల సినిమాల్లో చాన్స్ లు కొట్టేసిన మీనాక్షి.. హర్యానాలోని పంచ్ కులానీలో పుట్టి పెరిగింది. బీడీఎస్ చదువుతూనే మోడలింగ్ వైపు ఫోకస్ పెట్టింది. ‘ఫెమినా మిస్ ఇండియా హర్యానా2018 టైటిల్ ను దక్కించుకున్న ఆమె.. ఓ వెబ్ సిరీస్ లోనూ యాక్ట్ చేసింది. ‘బీడీఎస్ పూర్తి చేసి డాక్టర్ మీనాక్షి అనిపించుకున్నా. మిస్ ఇండియా పోటీలకూ వెళ్లా. ఐఏఎస్‌కావాలనే కోరిక మాత్రం అలానే ఉంది. ఏదో ఒక సినిమాలో కలెక్టర్‌గా కనిపించి ఆనందిస్తా’ అని గతంలో ఓ ఇంటర్య్యూలో ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే మీనాక్షికి ఇన్ స్టాగ్రామ్ లో క్రేజ్ మామూలుగా లేదు. తాజాగా ఆమె అప్ లోడ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

What's Your Reaction?