Megastar Chiranjeevi Birthday Special : మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్
మెగాస్టార్ చిరంజీవి.. స్వయంకృషికి చిరునామా. ఎన్నో ఛాలెజింగ్ రోల్స్ తో బాక్సాఫీస్ నూ అభిమానుల్నీ గెలుచుకున్న విజేత. అందుకే నీ ప్రాణం ఖరీదు ఎంత అంటే అభిమానుల గుండె చప్పట్లంత అని చెబుతాడు. ప్రతిభ శిఖరమంతైనా.. ప్రతిసారీ ప్రయత్నలోపం పిసరంత కూడా చూపని డాక్టర్ శంకర్ దాదా. దశాబ్ధాలుగా బాక్సాఫీస్ ను హిట్లర్ లా రూల్ చేస్తోన్న ఈ వెండితెర ఇంద్రుడిని ఆదర్శంగా తీసుకుని.. ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లెంతమంది..? ఇవాళ తెలుగు సినిమా కమర్షియల్ స్టాండర్డ్స్ ను ఎల్లలు దాటించిన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు.మెగాస్టార్ చిరంజీవి .. ఎన్ని మైలు రాళ్లు దాటితే.. ఎన్ని అవమానాలు సహిస్తే.. ఎన్ని ఛాలెంజ్ లను స్వీకరిస్తే.. ఎన్ని రివార్డులు పొందితే.. ఎన్ని రికార్డులు నెలకొల్పితే వచ్చిందీ పేరు. అంతేనా .. ప్యాషన్ కు స్వయంకృషిని జోడించి, పట్టుదలతో ప్రయత్నిస్తే ఒక మనిషి ఎన్ని శిఖరాలైనా అధిరోహించవచ్చు అన్న మాటకు కూడా అక్షర రూపం ఆ పేరు.. నలభై యేళ్ల క్రితం.. ముగ్గురు నలుగురిలో ఒకడిగా మొదలై.. మూడు నాలుగు కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకునే వరకూ సాగిన చిరంజీవి ప్రస్థానం అనన్యసామాన్యమైనది.టీనేజ్ లో ఎవరైనా జీవితం గురించి కలలు కంటారు. కానీ చిరంజీవి తనలోని ‘కళ’ గురించి కలలు కన్నాడు. ఆ కళను పదిమందికీ చూపించాలనే కలలు కన్నాడు. ఆ కలను కేవలం తాపత్రయంగానే మిగుల్చుకోకుండా తపనగా మలచుకున్నాడు. దానికి సాధించాలనే కసిని రంగరించి.. వెండితెర కాన్వాస్ పై ఓ తెల్లకాగితంగా మారేంత వరకూ ఎన్నో చేశాడు. అవన్నీ అతనికి తప్ప ఎవరికీ తెలియవు. చిరంజీవి అనగానే వెంటనే గుర్తొచ్చే డ్యాన్స్.. సినిమాల్లోకి రావాలనుకున్న టైమ్ లో.. అప్పటికే వచ్చిన ఎన్నో సినిమాల్లోని డ్యాన్స్ లను తనదైన శైలిలో ప్రదర్శిస్తూ.. స్నేహితుల్నీ, సన్నిహితుల్నీ సమ్మోహన పరచిన ఆ చిరంజీవి.. తర్వాత ఇండియన్ సినిమా హిస్టరీలో డ్యాన్స్ ను ఓ అధ్యాయంగా నిలుపుతాడనీ.. దానికి అతనే తొలి గురువుగా నిలుస్తాడని అప్పుడెవరూ ఊహించి ఉండరు కదా. చిరంజీవి ఎస్సెట్ అతని కళ్లు. ఆ కళ్లలో కనిపించే ఫైర్. అందుకే.. ఈ కుర్రాడి కళ్లు భలే ఉన్నాయే అనుకుని వేశాలిచ్చిన వాళ్లూ ఉన్నారు. ఏదైనా సాధించాలనుకునేవాడి కళ్లలో ఇలాంటి ఫైర్ ఉంటేనే అతను సాధిస్తాడు. అటుపై మెరుపులా కదిలే అతని బాడీ. ఏ ఎక్స్ ప్రెషన్ నైనా పలికించే అభినయం.. మొత్తంగా నేను అనుకున్నది సాధించగలను అన్న అంతులేని ఆత్మవిశ్వాసమే అతన్ని గెలిపించింది.. ఆ గెలుపు సాధ్యమైన తర్వాత .. అతను ఎన్ని గెలిచుకున్నాడో మనకూ తెలుసు కదా.. మెరికలా కదులుతూ.. ఒక్కో సినిమాకు లక్షలమందిని ఆకర్షిస్తూ.. ఆఫర్స్ వచ్చేలా చేసుకున్నాడు. కష్టేఫలీ అన్నట్టుగా అతని చురుకుదనానికి అతి తక్కువ టైమ్ లోనే సోలో హీరోగా అవకాశాలు వచ్చాయి. కానీ అప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్ హీరోలున్నారు. అందరూ శిఖరాల్లాంటి వారే. మరి కొండలమధ్య తనో గుట్టలా నిలవకుండా ఒక్కో హిట్టూ పేర్చుకుంటూ ఆ శిఖరాల దరిలోనే తనో శిఖరంగా ఎదిగే ప్రయత్నం చేశాడు.. చిరంజీవి ప్రస్థానం.. చినుకులా మొదలైంది.. చివరికి అది ఓ మహానదిగా మారింది. ఇప్పుడా మహానదిని అనుసంధానించుకుంటూ ఎన్ని కాలువలు ప్రవహిస్తున్నాయో తెలుస్తోంది కదా. అందుకు కారణం.. అతను చినుకులా మొదలైనప్పుడు ఎంత స్థితప్రజ్ఞతతో ఉన్నాడో.. నదిలా మారినప్పుడూ అదే స్థితప్రజ్ఞతను చూపిస్తున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎదిగిన కొద్దీ ఒదుగుతూ కెరీర్ ను నిర్మించుకున్న మగమహారాజు అదృష్ణమే కలిసి వచ్చింది.. కష్టానికి ఫలితంగా వచ్చిందో.. కానీ ఎంతో మంది మహానటులు, సూపర్ స్టార్లున్న పరిశ్రమలో అతనికి తనదైన రికగ్నిషన్ ఇచ్చిన సినిమా ఖైదీ. ఇది లేకపోతే అనే ప్రశ్నే అక్కర్లేదు అన్నట్టుగా ఆ సినిమాలో అతని నటన కనిపిస్తుంది. ఆశయం, ఆవేదన, ఆక్రోశం, నిస్సహాయత చివరికి తిరుగుబాటు.. ఇలా ఎన్నో దశల్నీ అద్భుతమైన అభినయంతో చూపించాడీ సినిమాలో. అందుకే చిరంజీవికి ఖైదీ అదృష్టం అని చెప్పలేం. ఖచ్చితంగా అది అతని ప్రతిభకు దక్కిన వరం. తెలివి, బలం ఉన్నవాడికి కాస్త అండ కూడా ఉంటే.. ఇక అతని ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. చిరంజీవి వినమ్రత నచ్చి అల్లు రామలింగయ్య అల్లుడిగా చేసుకున్నారు. అప్పటికి ఆయన ఇండస్ట్రీలోని అతి ముఖ్యుల్లో ఒకరు. అయితే అండ దొరికింది కదా అని చిరంజీవి ఎప్పుడూ అహంకారాన్ని ప్రదర్శించలేదు. అంచెలంచెలుగా సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ గా ఎదుగుతూ వెళ్లాడు. ఒక దశలో చిరంజీవి డేట్స్ కావాలంటే అడ్వాన్స్ లు ఇచ్చిన వారికి కూడా మూడు నాలుగేళ్లు పట్టేంతగా అతని కీర్తి పెరుగుతూ పోయింది.చాలామంది అంటూ ఉంటారు.. దేనికైనా కాలం కలిసి రావాలని. కానీ వస్తోన్న కాలాన్ని కావాల్సినట్టుగా మలచుకోవడమే అసలైన విజయ రహస్యం. చిరంజీవి ఇదే చేశాడు. వచ్చిన ఇమేజ్ కీ, తన బాడీ లాంగ్వేజ్ కు సరిపడే కథల్ని మాత్రమే ఎంచుకుంటూ పోయాడు. అదే అతన్ని ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి గ్యాంగ్ లీడర్ ను చేసింది. రెండు దశాబ్ధాల క్రితం..చిరంజీవి అన్న పేరు బాక్సాఫీస్ కు మంత్రమైపోయింది. చిరంజీవి అన్న పేరు తర్వాత ఇంకెవరున్నా అనవసరం.. అన్నంతగా ఆ ఇమేజ్ పెరిగిపోయింది. ఆ ఇమేజ్ ను క్యాష్ చేసుకోగలిగినవాళ్లు చేసుకున్నారు.. అవకాశం వచ్చినా మిస్ చేసుకున్న వాళ్లూ ఉన్నారు. కానీ ఏం జరిగినా మెగాస్టార్ అనే కిరీటం మాత్రం ఎప్పుడూ తలదిగలేదు. అదే ఇతర హీరోల్నుంచి మెగా స్టార్ ను వేరు చేస్తుంది.చిరంజీవి ఊరికే మాస్ హీరో అయిపోలేదు. మాస్ ఇమేజ్ ఎలివేట్ అవడానికి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా.. అతను కథలను వదల్లేదు. ఆ సెలక్షన్ లో మిస్టేక్స్ లేకపోవడం వల్లే అతను టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయ్యాడు. అతను ఎంచుకున్న సినిమాల్లోని కథలే.. అతన్ని బిగ్గర్ దన్ బిగ్ బి అనే స్థాయి హీరోను చేశాయి.. ఈ విషయంలో మాస్ హీరోలు కావాలనుకునే కుర్ర హీరోలు చిరంజీవి పాత సినిమాలు పెట్టుకుని చూస్తే.. అతను ఎందుకు మెగాస్టార్ అయ్యాడో అర్థమౌతుంది.మరి అంత ఇమేజ్ ఉన్నా చిరంజీవికి ఫ్లాపుల్లేవా.. అంటే ఉన్నాయి.. ఇంకా చెప్పాలంటే ఎంతో ఇమేజ్ ఉన్న తనే డిప్రెషన్ లోకి వెళ్లిపోయే అన్ని ఫ్లాపులు వచ్చాయి. ఒక దశలో ఇక చిరంజీవి పని ఐపోయింది అన్నవాళ్లూ ఉన్నారు. అందుకు కారణం.. చేదు అయినా నిజం చెప్పాలంటే ఇమేజ్ వల్ల వచ్చి
మెగాస్టార్ చిరంజీవి.. స్వయంకృషికి చిరునామా. ఎన్నో ఛాలెజింగ్ రోల్స్ తో బాక్సాఫీస్ నూ అభిమానుల్నీ గెలుచుకున్న విజేత. అందుకే నీ ప్రాణం ఖరీదు ఎంత అంటే అభిమానుల గుండె చప్పట్లంత అని చెబుతాడు. ప్రతిభ శిఖరమంతైనా.. ప్రతిసారీ ప్రయత్నలోపం పిసరంత కూడా చూపని డాక్టర్ శంకర్ దాదా. దశాబ్ధాలుగా బాక్సాఫీస్ ను హిట్లర్ లా రూల్ చేస్తోన్న ఈ వెండితెర ఇంద్రుడిని ఆదర్శంగా తీసుకుని.. ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లెంతమంది..? ఇవాళ తెలుగు సినిమా కమర్షియల్ స్టాండర్డ్స్ ను ఎల్లలు దాటించిన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు.
మెగాస్టార్ చిరంజీవి .. ఎన్ని మైలు రాళ్లు దాటితే.. ఎన్ని అవమానాలు సహిస్తే.. ఎన్ని ఛాలెంజ్ లను స్వీకరిస్తే.. ఎన్ని రివార్డులు పొందితే.. ఎన్ని రికార్డులు నెలకొల్పితే వచ్చిందీ పేరు. అంతేనా .. ప్యాషన్ కు స్వయంకృషిని జోడించి, పట్టుదలతో ప్రయత్నిస్తే ఒక మనిషి ఎన్ని శిఖరాలైనా అధిరోహించవచ్చు అన్న మాటకు కూడా అక్షర రూపం ఆ పేరు.. నలభై యేళ్ల క్రితం.. ముగ్గురు నలుగురిలో ఒకడిగా మొదలై.. మూడు నాలుగు కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకునే వరకూ సాగిన చిరంజీవి ప్రస్థానం అనన్యసామాన్యమైనది.
టీనేజ్ లో ఎవరైనా జీవితం గురించి కలలు కంటారు. కానీ చిరంజీవి తనలోని ‘కళ’ గురించి కలలు కన్నాడు. ఆ కళను పదిమందికీ చూపించాలనే కలలు కన్నాడు. ఆ కలను కేవలం తాపత్రయంగానే మిగుల్చుకోకుండా తపనగా మలచుకున్నాడు. దానికి సాధించాలనే కసిని రంగరించి.. వెండితెర కాన్వాస్ పై ఓ తెల్లకాగితంగా మారేంత వరకూ ఎన్నో చేశాడు. అవన్నీ అతనికి తప్ప ఎవరికీ తెలియవు.
చిరంజీవి అనగానే వెంటనే గుర్తొచ్చే డ్యాన్స్.. సినిమాల్లోకి రావాలనుకున్న టైమ్ లో.. అప్పటికే వచ్చిన ఎన్నో సినిమాల్లోని డ్యాన్స్ లను తనదైన శైలిలో ప్రదర్శిస్తూ.. స్నేహితుల్నీ, సన్నిహితుల్నీ సమ్మోహన పరచిన ఆ చిరంజీవి.. తర్వాత ఇండియన్ సినిమా హిస్టరీలో డ్యాన్స్ ను ఓ అధ్యాయంగా నిలుపుతాడనీ.. దానికి అతనే తొలి గురువుగా నిలుస్తాడని అప్పుడెవరూ ఊహించి ఉండరు కదా.
చిరంజీవి ఎస్సెట్ అతని కళ్లు. ఆ కళ్లలో కనిపించే ఫైర్. అందుకే.. ఈ కుర్రాడి కళ్లు భలే ఉన్నాయే అనుకుని వేశాలిచ్చిన వాళ్లూ ఉన్నారు. ఏదైనా సాధించాలనుకునేవాడి కళ్లలో ఇలాంటి ఫైర్ ఉంటేనే అతను సాధిస్తాడు. అటుపై మెరుపులా కదిలే అతని బాడీ. ఏ ఎక్స్ ప్రెషన్ నైనా పలికించే అభినయం.. మొత్తంగా నేను అనుకున్నది సాధించగలను అన్న అంతులేని ఆత్మవిశ్వాసమే అతన్ని గెలిపించింది.. ఆ గెలుపు సాధ్యమైన తర్వాత .. అతను ఎన్ని గెలిచుకున్నాడో మనకూ తెలుసు కదా.. మెరికలా కదులుతూ.. ఒక్కో సినిమాకు లక్షలమందిని ఆకర్షిస్తూ.. ఆఫర్స్ వచ్చేలా చేసుకున్నాడు. కష్టేఫలీ అన్నట్టుగా అతని చురుకుదనానికి అతి తక్కువ టైమ్ లోనే సోలో హీరోగా అవకాశాలు వచ్చాయి. కానీ అప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్ హీరోలున్నారు. అందరూ శిఖరాల్లాంటి వారే. మరి కొండలమధ్య తనో గుట్టలా నిలవకుండా ఒక్కో హిట్టూ పేర్చుకుంటూ ఆ శిఖరాల దరిలోనే తనో శిఖరంగా ఎదిగే ప్రయత్నం చేశాడు..
చిరంజీవి ప్రస్థానం.. చినుకులా మొదలైంది.. చివరికి అది ఓ మహానదిగా మారింది. ఇప్పుడా మహానదిని అనుసంధానించుకుంటూ ఎన్ని కాలువలు ప్రవహిస్తున్నాయో తెలుస్తోంది కదా. అందుకు కారణం.. అతను చినుకులా మొదలైనప్పుడు ఎంత స్థితప్రజ్ఞతతో ఉన్నాడో.. నదిలా మారినప్పుడూ అదే స్థితప్రజ్ఞతను చూపిస్తున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎదిగిన కొద్దీ ఒదుగుతూ కెరీర్ ను నిర్మించుకున్న మగమహారాజు
అదృష్ణమే కలిసి వచ్చింది.. కష్టానికి ఫలితంగా వచ్చిందో.. కానీ ఎంతో మంది మహానటులు, సూపర్ స్టార్లున్న పరిశ్రమలో అతనికి తనదైన రికగ్నిషన్ ఇచ్చిన సినిమా ఖైదీ. ఇది లేకపోతే అనే ప్రశ్నే అక్కర్లేదు అన్నట్టుగా ఆ సినిమాలో అతని నటన కనిపిస్తుంది. ఆశయం, ఆవేదన, ఆక్రోశం, నిస్సహాయత చివరికి తిరుగుబాటు.. ఇలా ఎన్నో దశల్నీ అద్భుతమైన అభినయంతో చూపించాడీ సినిమాలో. అందుకే చిరంజీవికి ఖైదీ అదృష్టం అని చెప్పలేం. ఖచ్చితంగా అది అతని ప్రతిభకు దక్కిన వరం.
తెలివి, బలం ఉన్నవాడికి కాస్త అండ కూడా ఉంటే.. ఇక అతని ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. చిరంజీవి వినమ్రత నచ్చి అల్లు రామలింగయ్య అల్లుడిగా చేసుకున్నారు. అప్పటికి ఆయన ఇండస్ట్రీలోని అతి ముఖ్యుల్లో ఒకరు. అయితే అండ దొరికింది కదా అని చిరంజీవి ఎప్పుడూ అహంకారాన్ని ప్రదర్శించలేదు. అంచెలంచెలుగా సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ గా ఎదుగుతూ వెళ్లాడు. ఒక దశలో చిరంజీవి డేట్స్ కావాలంటే అడ్వాన్స్ లు ఇచ్చిన వారికి కూడా మూడు నాలుగేళ్లు పట్టేంతగా అతని కీర్తి పెరుగుతూ పోయింది.
చాలామంది అంటూ ఉంటారు.. దేనికైనా కాలం కలిసి రావాలని. కానీ వస్తోన్న కాలాన్ని కావాల్సినట్టుగా మలచుకోవడమే అసలైన విజయ రహస్యం. చిరంజీవి ఇదే చేశాడు. వచ్చిన ఇమేజ్ కీ, తన బాడీ లాంగ్వేజ్ కు సరిపడే కథల్ని మాత్రమే ఎంచుకుంటూ పోయాడు. అదే అతన్ని ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి గ్యాంగ్ లీడర్ ను చేసింది. రెండు దశాబ్ధాల క్రితం..చిరంజీవి అన్న పేరు బాక్సాఫీస్ కు మంత్రమైపోయింది. చిరంజీవి అన్న పేరు తర్వాత ఇంకెవరున్నా అనవసరం.. అన్నంతగా ఆ ఇమేజ్ పెరిగిపోయింది. ఆ ఇమేజ్ ను క్యాష్ చేసుకోగలిగినవాళ్లు చేసుకున్నారు.. అవకాశం వచ్చినా మిస్ చేసుకున్న వాళ్లూ ఉన్నారు. కానీ ఏం జరిగినా మెగాస్టార్ అనే కిరీటం మాత్రం ఎప్పుడూ తలదిగలేదు. అదే ఇతర హీరోల్నుంచి మెగా స్టార్ ను వేరు చేస్తుంది.చిరంజీవి ఊరికే మాస్ హీరో అయిపోలేదు. మాస్ ఇమేజ్ ఎలివేట్ అవడానికి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా.. అతను కథలను వదల్లేదు. ఆ సెలక్షన్ లో మిస్టేక్స్ లేకపోవడం వల్లే అతను టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయ్యాడు. అతను ఎంచుకున్న సినిమాల్లోని కథలే.. అతన్ని బిగ్గర్ దన్ బిగ్ బి అనే స్థాయి హీరోను చేశాయి.. ఈ విషయంలో మాస్ హీరోలు కావాలనుకునే కుర్ర హీరోలు చిరంజీవి పాత సినిమాలు పెట్టుకుని చూస్తే.. అతను ఎందుకు మెగాస్టార్ అయ్యాడో అర్థమౌతుంది.
మరి అంత ఇమేజ్ ఉన్నా చిరంజీవికి ఫ్లాపుల్లేవా.. అంటే ఉన్నాయి.. ఇంకా చెప్పాలంటే ఎంతో ఇమేజ్ ఉన్న తనే డిప్రెషన్ లోకి వెళ్లిపోయే అన్ని ఫ్లాపులు వచ్చాయి. ఒక దశలో ఇక చిరంజీవి పని ఐపోయింది అన్నవాళ్లూ ఉన్నారు. అందుకు కారణం.. చేదు అయినా నిజం చెప్పాలంటే ఇమేజ్ వల్ల వచ్చిన ఓవర్ కాన్ఫిడెన్సే. కొంత గ్యాప్ తీసుకుని.. కేవలం ఆ ఓవర్ తీసేసి తనదైన కాన్ఫిడెన్స్ తో కొత్తగా మొదలుపెట్టాడు.. మళ్లీ హిట్లర్ రూలింగ్ మొదలైంది.ఇప్పుడైనా.. ఇక ముందైనా చిరంజీవిని జయాపజయాల కొలతల్లో చూడకూడదు.. లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను పడ్డ శ్రమను చూడాలి. ఎంచుకున్న రంగంలో రాణించడానికి అతను చూపించిన వైవిధ్యం చూడాలి. రొటీన్ అన్న పదాన్ని బ్రేక్ చేస్తేనే క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండగలరు. ఆ విషయాన్ని గుర్తించడానికి చిరంజీవిని చూడాలి. అలా చూసిన ఎందరికో ఆయన చేయూతనిచ్చాడు. సినిమా సంద్రంలోకి దూకాలనుకున్న వారిని నదిలా అక్కున చేర్చుకుని.. ఆ సంద్రం వైపు నడిపిస్తున్నాడు..మెగాస్టార్ గా కోట్లమంది హృదయాల్లో కొలువై ఉన్న చిరంజీవి.. ఇలాగే నిత్య యవ్వనుడిలా ఉంటూ.. చిరంజీవిలా మనల్ని ఎంటర్టైన్ చేయాలని అభిలషిస్తూ.. ఈ వెండితెర ఇంద్రుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం.
- బాబురావు. కామళ్ల
What's Your Reaction?