Megha Akash : ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హీరోయిన్ మేఘా ఆకాశ్
సినీ హీరోయిన్ మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. సాయి విష్ణు గురించి, పెళ్లి తేదీ వివరాలు తెలియాల్సి ఉంది. చెన్నైలో పుట్టి పెరిగిన మేఘా ఆకాశ్ హీరో నితిన్ సినిమా 'లై'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో సైతం పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. గత కొంత కాలం నుంచి మేఘా ఆకాశ్ పెళ్లిపై ప్రచారం జరుగుతోంది. తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడబోతోందనే రూమర్స్ వచ్చాయి. దీనిపై ప్రచారం కొనసాగుతుండగానే... ఎలాంటి హడావుడి లేకుండా విష్ణుతో ఆమె నిశ్చితార్థం చేసుకుంది. అయితే, విష్ణు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. పెళ్లిపీటలు ఎక్కబోతున్న మేఘకు ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

What's Your Reaction?