Megha Akash : మేఘా ఆకాశ్ .. మ్యారేజ్ కి రెడీ
మేఘా ఆకాశ్.. తెలుగులో లై అనే మూవీతో పరిచయం అయింది. నితిన్ హీరోగా నటించిన సినిమా ఇది. పెద్దగా ఆడలేదీ సినిమా. అయినా నితిన్ ఛల్ మోహన రంగాలోనూ అవకాశం అందుకుంది. అదీ పోయింది. బ్యూటీఫుల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఈ భామకు లక్ చిక్కలేదు. తర్వాత తమిళ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడైనా ఇక్కడైనా అడపాదడపా ఆఫర్స్ వచ్చాయి కానీ కెరీర్ కు బ్రేక్ ఇచ్చే సినిమా పడలేదు. తెలుగులో రాజ రాజ చోర మాత్రమే హిట్. మరి ఇంకా ఎదురు చూడ్డం ఎందుకు అనుకుందో లేక తను చాలాకాలంగా ప్రేమిస్తున్న సాయి విష్ణు తొందర పెట్టాడో కానీ మొత్తంగా పెళ్లికి సిద్ధమైంది. తాజాగా తన ప్రియుడు సాయి విష్ణుతో నిశ్చితార్థం పూర్తయింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కొన్నాళ్లుగా చాలామంది హీరోయిన్లు వైవాహిక జీవితంలోకి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో మేఘా ఆకాశ్ కూడా అదే బాటలో వెళుతోంది. మన మ్యారిటల్ లైఫ్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుందాం.
మేఘా ఆకాశ్.. తెలుగులో లై అనే మూవీతో పరిచయం అయింది. నితిన్ హీరోగా నటించిన సినిమా ఇది. పెద్దగా ఆడలేదీ సినిమా. అయినా నితిన్ ఛల్ మోహన రంగాలోనూ అవకాశం అందుకుంది. అదీ పోయింది. బ్యూటీఫుల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఈ భామకు లక్ చిక్కలేదు. తర్వాత తమిళ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడైనా ఇక్కడైనా అడపాదడపా ఆఫర్స్ వచ్చాయి కానీ కెరీర్ కు బ్రేక్ ఇచ్చే సినిమా పడలేదు. తెలుగులో రాజ రాజ చోర మాత్రమే హిట్. మరి ఇంకా ఎదురు చూడ్డం ఎందుకు అనుకుందో లేక తను చాలాకాలంగా ప్రేమిస్తున్న సాయి విష్ణు తొందర పెట్టాడో కానీ మొత్తంగా పెళ్లికి సిద్ధమైంది.
తాజాగా తన ప్రియుడు సాయి విష్ణుతో నిశ్చితార్థం పూర్తయింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కొన్నాళ్లుగా చాలామంది హీరోయిన్లు వైవాహిక జీవితంలోకి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో మేఘా ఆకాశ్ కూడా అదే బాటలో వెళుతోంది. మన మ్యారిటల్ లైఫ్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుందాం.
What's Your Reaction?