ఎమ్మెల్యే "ఏలూరి"కి విజనరీ లీడర్ అవార్డు.. లండన్ బ్రిటిష్ పార్లమెంట్ వేదికగా అవార్డు
ఎమ్మెల్యే "ఏలూరి"కి విజనరీ లీడర్ అవార్డు.. లండన్ బ్రిటిష్ పార్లమెంట్ వేదికగా అవార్డు
ఎమ్మెల్యే "ఏలూరి"కి విజినరీ లీడర్ అవార్డు •లండన్ నుంచి ఎన్ఆర్ఐ ప్రతినిధి ద్వారా ఏలూరికి అందజేత •లండన్ బ్రిటిష్ పార్లమెంట్ వేదికగా అవార్డు అందుకున్న నేతలు •ప్రజానేతకు అరుదైన అంతర్జాతీయ పురస్కారం దక్కిన విషయం తెలిసింది. బ్రిటిష్ పార్లమెంట్ లండన్ వేదికగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్ ఇంగ్లాండ్ ప్రకటించిన విజనరీ లీడర్ అవార్డు ఎమ్మెల్యే ఏలూరికి చేరుకుంది. లండన్ నుంచి ఈ అవార్డును లండన్ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎన్నారై ప్రతినిధి చింతలపూడి రామ్ ఎమ్మెల్యే ఏలూరికి అందజేశారు.
గత నెల 15న లండన్ పార్లమెంట్ వేదికగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కి విజనరీ లీడర్ అవార్డు ప్రకటించిన విషయం విధితమే. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే ఏలూరి లండన్ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో యూకే వ్యవహారాల తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఎమ్మెల్యే ఏలూరి తరఫున అవార్డు అందుకున్నారు. దీంతో ఆదివారం లండన్ నుంచి ఇండియాకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రతినిధి చింతలపూడి రామ్ అవార్డును ఎమ్మెల్యే ఏలూరికి అందజేశారు. ప్రతినిత్యం ప్రజా శ్రేయస్సు కాంక్షించే ఎమ్మెల్యే ఏలూరికి అరుదైన గౌరవం దక్కింది. లండన్ వేదికగా ప్రజల అర్షద్వానాల మధ్య ప్రజా నేత సాంబన్నకు లండన్ పార్లమెంట్ అతిరథ మహారథులసమక్షంలో అంతర్జాతీయ అందుకోవడం గర్వకారణమని రామ్ తెలిపారు. నిరంతరం ప్రజల కోసం ప్రజల వెంట ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న సాంబన్నకు వచ్చిన ఈ పురస్కారాన్ని అందుకోవడం తమ అదృష్టం అన్నారు. దేశ వ్యాప్తంగా ముగ్గురికి ఈ అవార్డు లభించింది.
వీరిలో ఎమ్మెల్యే ఏలూరి ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే ఏలూరి అవార్డు ప్రధానోత్సవానికి యూకే పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఎమ్మెల్యే ఏలూరి తరఫున అవార్డు ప్రధానోత్సవంలో యూకే ఎన్నారై వ్యవహారాల నేతలు అవార్డును అందుకున్నారు.యూకే ఎన్నారై ప్రతినిధి అవార్డును ఎమ్మెల్యే ఏలూరికి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అరుదైన అవార్డు లండన్ లో తెలుగు జాతిఖ్యాతిని పెంచిందన్నారు. ఎమ్మెల్యే ఏలూరికి అరుదైన అంతర్జాతీయ పురస్కారం రావడం పట్ల అసెంబ్లీ వేదికగా సహచర ఎమ్మెల్యేలు ,మంత్రులు, ముఖ్యమంత్రి ,సభాపతి ప్రశంసించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నారు.
What's Your Reaction?