Mohan Lal : ‘అమ్మ’కు మోహన్ లాల్ రాజీనామా
మలయాళ ఇండస్ట్రీని జస్టిస్ హేమ రిపోర్ట్ కుదిపేస్తోంది.ఆ ఇండస్ట్రీలో పనిచేసే మహిళా ఆర్టిస్టులు కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని ఆ రిపోర్ట్ పేర్కొంది. దీనిపై దుమారం రేగుతున్న వేళ.. మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(ఏఎంఎంఏ) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులు పదవుల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ‘అమ్మ’ సంఘం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో నైతిక బాధ్యతగా వీరంతా రాజీనామా చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మూకుమ్మడి రాజీనామాలతో మలయాళ మూవీ కౌన్సిల్ ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త కౌన్సిల్ ను ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.

What's Your Reaction?