MPOX : మంకీపాక్స్ ను కంట్రోల్ చేయొచ్చు... డబ్ల్యూహెచ్ వో వెల్లడి
ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికా దాటి పలు దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ ఆందోళన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) కీలక వ్యాఖ్యలు చేసింది. మంకీపాక్స్.. కరోనా కాదని, దాని వ్యాప్తిని కంట్రోల్ చేయొచ్చని తెలిపింది. డబ్ల్యూహెచ్‌వోలో యూరప్ రీజినల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న హాన్స్ క్లుగే మీడియాతో మాట్లాడుతూ.. మంకీపాక్స్ వ్యాప్తిని నియంత్రించేందుకు, నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమయంలో ప్రపంచం స్పందించే తీరు కీలకమని వ్యాఖ్యానించారు. ‘దీనిని కలిసికట్టుగా ఎదుర్కోవాలి. మనం ఈ వైరస్‌ను నియంత్రిస్తామా..మరోసారి నిర్లక్ష్యం, భయం వైపు వెళ్తామా..అనేది మన స్పందనపై ఆధారపడి ఉంటుంది. రానున్న ఏళ్లలో ఐరోపా, ప్రపంచానికి ఇది మరో పరీక్షే’అని హెచ్చరించారు.

What's Your Reaction?