Mufasa voice of Mahesh :
ముఫాసా ట్రైలర్.. మహేష్ బాబు వాయిస్ సూపర్
ముఫాసా.. ది లయన్ కింగ్ మూవీలో సింహానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అన్నప్పుడే అంచనాలు పెరిగాయి. ది లయన్ కింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా కోట్లాది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఫ్యాన్స్ లో సినిమా స్టార్స్ కూడా ఉన్నారు అనేది నిజం. అందుకే మహేష్ బాబు కూడా ఆనందంగా ఒక అభిమానిలాగా ఒప్పుకున్నాడు. ఇక అంతా ఎదురుచూస్తున్నట్టుగానే ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ లో కాబోయే మహారాజుకు మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్.. వాహ్.. అనిపించేలా ఉంది.ముఫాసా చిన్నప్పటి నుంచి ప్రారంభం అయిన ఈ ట్రైలర్ లో ముఫాసాతో పాటు అతని ఫ్రెండ్ టాకాతో మొదలవుతుంది. ఈ ఇద్దరి మధ్య ఎవరు మహరాజు కావాలనే పోటీ ఉంటుంది. కానీ వాళ్లు మంచి ఫ్రెండ్స్. ‘ అప్పుడప్పుడూ ఈ చల్లని గాలి.. నా ఇంటినుంచొచ్చే జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్నట్టు ఉంటుంది.. అంతలోనే మాయం అవుతుంది.. ’అనే డైలాగ్ తో అప్పుడు స్టార్ట్ అవుతుంది మహేష్ వాయిస్.. ‘ మనం ఒక్కటిగా పోరాడాలి, నేనుండగా నీకేం కాదు టాకా.. భయపడకు, ఇందాకా ఏదో అన్నావే.. ’ అనే సూపర్ స్టార్ డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి. ఇక ట్రైలర్ పరంగా చూస్తే మరోసారి ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకువెళ్లేలా వాల్ట్ డిస్నీ సంస్థ హై ఎండ్ టెక్నాలజీతో మెస్మరైజ్ చేసేలా కనిపిస్తోంది. విజువల్స్, ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో పాటు ఇతర పాత్రల డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మొత్తంగా ఈ యేడాది డిసెంబర్ 20న విడుదల కాబోతోన్న ముఫాసా : ది లయన్ కింగ్ ను మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లిస్ట్ లోకి చేర్చిందీ ట్రైలర్.


ముఫాసా.. ది లయన్ కింగ్ మూవీలో సింహానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అన్నప్పుడే అంచనాలు పెరిగాయి. ది లయన్ కింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా కోట్లాది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఫ్యాన్స్ లో సినిమా స్టార్స్ కూడా ఉన్నారు అనేది నిజం. అందుకే మహేష్ బాబు కూడా ఆనందంగా ఒక అభిమానిలాగా ఒప్పుకున్నాడు. ఇక అంతా ఎదురుచూస్తున్నట్టుగానే ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ లో కాబోయే మహారాజుకు మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్.. వాహ్.. అనిపించేలా ఉంది.
ముఫాసా చిన్నప్పటి నుంచి ప్రారంభం అయిన ఈ ట్రైలర్ లో ముఫాసాతో పాటు అతని ఫ్రెండ్ టాకాతో మొదలవుతుంది. ఈ ఇద్దరి మధ్య ఎవరు మహరాజు కావాలనే పోటీ ఉంటుంది. కానీ వాళ్లు మంచి ఫ్రెండ్స్. ‘ అప్పుడప్పుడూ ఈ చల్లని గాలి.. నా ఇంటినుంచొచ్చే జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్నట్టు ఉంటుంది.. అంతలోనే మాయం అవుతుంది.. ’అనే డైలాగ్ తో అప్పుడు స్టార్ట్ అవుతుంది మహేష్ వాయిస్.. ‘ మనం ఒక్కటిగా పోరాడాలి, నేనుండగా నీకేం కాదు టాకా.. భయపడకు, ఇందాకా ఏదో అన్నావే.. ’ అనే సూపర్ స్టార్ డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి.
ఇక ట్రైలర్ పరంగా చూస్తే మరోసారి ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకువెళ్లేలా వాల్ట్ డిస్నీ సంస్థ హై ఎండ్ టెక్నాలజీతో మెస్మరైజ్ చేసేలా కనిపిస్తోంది. విజువల్స్, ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో పాటు ఇతర పాత్రల డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మొత్తంగా ఈ యేడాది డిసెంబర్ 20న విడుదల కాబోతోన్న ముఫాసా : ది లయన్ కింగ్ ను మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లిస్ట్ లోకి చేర్చిందీ ట్రైలర్.
What's Your Reaction?






