Nagarjuna : నాగార్జున మాస్ ను ప్రమోట్ చేస్తాడా

అక్కినేని నాగార్జున బర్త్ డే ఈ నెల 29న. ఈ సందర్భంగా ఇప్పుడున్న రీ రిలీజ్ ల ట్రెండ్ లో ఫ్యాన్స్ ఆయన నటించిన మాస్ సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు. సింపుల్ గా ఈ మూవీకీ టెక్నికల్ అసెట్స్ యాడ్ చేశారు. అయితే మాస్ మూవీ అప్పట్లో రికార్డులేం బద్ధలు కొట్టలేదు. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా హిట్ అయిందంతే. ఈ మూవీతోనే డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ దర్శకుడుగా మారాడు. జ్యోతిక హీరోయిన్ గా నటించింది. ఛార్మీ మరో హీరోయిన్. సునిల్ కీలక పాత్ర చేశాడు. ఈ మూడు పాత్రలూ ఎక్కువగా ఆకట్టుకున్నాయీ మూవీలో. అయినా అభిమాన హీరో సినిమా కాబట్టి ఫ్యాన్స్ అంతా చూస్తారు. కాకపోతే ఎప్పట్లానే హీరోతో పాటు దర్శకుడు ఇతర కీలక పాత్రలు సినిమా గురించి ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది.మొన్నటి వరకూ నాగ్ కూడా మాస్ మూవీ రీ రిలీజ్ పై ఉత్సాహంగానే ఉన్నాడు. కానీ తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలను బట్టి ఆయన అదే ఉత్సాహంతో ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేస్తాడా అనే డౌట్స్ వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నాగార్జునకు చెందిన 'ఎన్ కన్వెన్షన్' ఫంక్షన్ హాల్ ను పూర్తిగా నేలమట్టం చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా చెరువును కబ్జా చేసి కట్టారు అనేది ఆరోపణ. అయితే ఆ స్థల వివాదం కోర్ట్ లో ఉంది. అయినా తనకు సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడం సరికాదంటూ కోర్ట్ కు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు నాగ్. ఈ లోగానే కట్టడం నేలమట్టం అయింది. సో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన అంశాలతో కోర్ట్ లో మిగతా వ్యవహారాలు చూడాల్సి ఉంటుంది. కబ్జా అయినా.. కాకున్నా.. ప్రస్తుతం ఇదో తలనొప్పి వ్యవహారం. ఈ టైమ్ లో మాస్ సినిమా కోసం టైమ్ ఇచ్చి.. ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచేందుకు ఆయన ప్రమోషన్స్ చేస్తాడు అనుకోవడం ఓవర్ ఎక్స్ పెక్టేషనే అవుతుంది. కాకపోతే నాగ్ కాస్త ఎక్కువ ప్రాక్టికల్ గా ఉంటాడు. అందుకే దేని విషయం దానిదే అంటూ మాస్ కోసం వస్తే ఫ్యాన్స్ ఖుష్ అవుతారు. 

Aug 25, 2024 - 23:06
Aug 25, 2024 - 23:11
 0  3
Nagarjuna : నాగార్జున మాస్ ను ప్రమోట్ చేస్తాడా

అక్కినేని నాగార్జున బర్త్ డే ఈ నెల 29న. ఈ సందర్భంగా ఇప్పుడున్న రీ రిలీజ్ ల ట్రెండ్ లో ఫ్యాన్స్ ఆయన నటించిన మాస్ సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు. సింపుల్ గా ఈ మూవీకీ టెక్నికల్ అసెట్స్ యాడ్ చేశారు. అయితే మాస్ మూవీ అప్పట్లో రికార్డులేం బద్ధలు కొట్టలేదు. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా హిట్ అయిందంతే. ఈ మూవీతోనే డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ దర్శకుడుగా మారాడు. జ్యోతిక హీరోయిన్ గా నటించింది. ఛార్మీ మరో హీరోయిన్. సునిల్ కీలక పాత్ర చేశాడు. ఈ మూడు పాత్రలూ ఎక్కువగా ఆకట్టుకున్నాయీ మూవీలో. అయినా అభిమాన హీరో సినిమా కాబట్టి ఫ్యాన్స్ అంతా చూస్తారు. కాకపోతే ఎప్పట్లానే హీరోతో పాటు దర్శకుడు ఇతర కీలక పాత్రలు సినిమా గురించి ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది.

మొన్నటి వరకూ నాగ్ కూడా మాస్ మూవీ రీ రిలీజ్ పై ఉత్సాహంగానే ఉన్నాడు. కానీ తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలను బట్టి ఆయన అదే ఉత్సాహంతో ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేస్తాడా అనే డౌట్స్ వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నాగార్జునకు చెందిన 'ఎన్ కన్వెన్షన్' ఫంక్షన్ హాల్ ను పూర్తిగా నేలమట్టం చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా చెరువును కబ్జా చేసి కట్టారు అనేది ఆరోపణ. అయితే ఆ స్థల వివాదం కోర్ట్ లో ఉంది. అయినా తనకు సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడం సరికాదంటూ కోర్ట్ కు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు నాగ్. ఈ లోగానే కట్టడం నేలమట్టం అయింది.

సో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన అంశాలతో కోర్ట్ లో మిగతా వ్యవహారాలు చూడాల్సి ఉంటుంది. కబ్జా అయినా.. కాకున్నా.. ప్రస్తుతం ఇదో తలనొప్పి వ్యవహారం. ఈ టైమ్ లో మాస్ సినిమా కోసం టైమ్ ఇచ్చి.. ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచేందుకు ఆయన ప్రమోషన్స్ చేస్తాడు అనుకోవడం ఓవర్ ఎక్స్ పెక్టేషనే అవుతుంది. కాకపోతే నాగ్ కాస్త ఎక్కువ ప్రాక్టికల్ గా ఉంటాడు. అందుకే దేని విషయం దానిదే అంటూ మాస్ కోసం వస్తే ఫ్యాన్స్ ఖుష్ అవుతారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News