Nagarjuna Mass Re Release : నాగార్జున ఫ్యాన్స్ మాస్ హంగామా

స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్ ల్లో అభిమానుల హంగామా మామూలుగా ఉండటం లేదు. వీరికి కొత్త తరం ఫ్యాన్స్ కూడా తోడవుతున్నారు. ఆ సినిమాల రికార్డులు, రెవిన్యూలూ ఎలా ఉన్నా.. థియేటర్స్ లో మాత్రం ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. కొందరైతే థియేటర్స్ లో ఫర్నిచర్స్ ను కూడా ధ్వంసం చేసిన సందర్భాలూ ఉన్నాయి. అదంతా ఆనందాన్ని ఆపుకోలేక చేసేదే అని సర్ది చెప్పుకోవడం తప్ప చేసేదేం లేదు. ఇక నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన సూపర్ హిట్ మూవీ మాస్ ను రీ రిలీజ్ చేశారు. పుట్టిన రోజుకు ఒకరోజు ముందుగానే ఈ బుధవారం విడుదలైన మాస్ థియేటర్స్ లో కూడా ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. కొన్ని సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు. పాటలకు స్టెప్పులు వేస్తున్నారు. అస్సలే మాత్రం తగ్గడం లేదు అన్నట్టుగా ఉంది సిట్యుయేషన్.మాస్ ను రీ రిలీజ్ లో మొదట్లో శివ రీ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అలాగే నాగ చైతన్య దడ మూవీ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫ్యాన్స్ కు ఊహించని సర్ ప్రైజ్ గా మారాయి. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చేశారు. ప్రస్తుతం ఆయన ఆ హడావిడీలో ఉన్నాడు. కోర్ట్, కేస్ అంటూ బిజీగా ఉన్నాడు. దీంతో ఈ మూవీని ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోరు అనుకున్నారు. కానీ అదేం లేదు. అభిమానులు మా సంబరం మాదే... అయినా కన్వెన్షన్ తో మాకేం పని అన్నట్టుగా ఉన్నారు. బస్తాల కొద్దీ పేపర్స్ విసురుతూ తమ అభిమాన హీరో బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 

Aug 28, 2024 - 17:07
 0  1
Nagarjuna Mass Re Release :
నాగార్జున ఫ్యాన్స్ మాస్ హంగామా

స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్ ల్లో అభిమానుల హంగామా మామూలుగా ఉండటం లేదు. వీరికి కొత్త తరం ఫ్యాన్స్ కూడా తోడవుతున్నారు. ఆ సినిమాల రికార్డులు, రెవిన్యూలూ ఎలా ఉన్నా.. థియేటర్స్ లో మాత్రం ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. కొందరైతే థియేటర్స్ లో ఫర్నిచర్స్ ను కూడా ధ్వంసం చేసిన సందర్భాలూ ఉన్నాయి. అదంతా ఆనందాన్ని ఆపుకోలేక చేసేదే అని సర్ది చెప్పుకోవడం తప్ప చేసేదేం లేదు. ఇక నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన సూపర్ హిట్ మూవీ మాస్ ను రీ రిలీజ్ చేశారు. పుట్టిన రోజుకు ఒకరోజు ముందుగానే ఈ బుధవారం విడుదలైన మాస్ థియేటర్స్ లో కూడా ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. కొన్ని సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు. పాటలకు స్టెప్పులు వేస్తున్నారు. అస్సలే మాత్రం తగ్గడం లేదు అన్నట్టుగా ఉంది సిట్యుయేషన్.

మాస్ ను రీ రిలీజ్ లో మొదట్లో శివ రీ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అలాగే నాగ చైతన్య దడ మూవీ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫ్యాన్స్ కు ఊహించని సర్ ప్రైజ్ గా మారాయి. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చేశారు. ప్రస్తుతం ఆయన ఆ హడావిడీలో ఉన్నాడు. కోర్ట్, కేస్ అంటూ బిజీగా ఉన్నాడు. దీంతో ఈ మూవీని ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోరు అనుకున్నారు. కానీ అదేం లేదు. అభిమానులు మా సంబరం మాదే... అయినా కన్వెన్షన్ తో మాకేం పని అన్నట్టుగా ఉన్నారు. బస్తాల కొద్దీ పేపర్స్ విసురుతూ తమ అభిమాన హీరో బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News