Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు వరద వెల్లువ - సాగర్ కు 5 లక్షల ఇన్ ఫ్లో 26 గేట్లు ఓపెన్
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు వరద వెల్లువ - సాగర్ కు 5 లక్షల ఇన్ ఫ్లో 26 గేట్లు ఓపెన్
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు వరద వెల్లువ - సాగర్ కు 5 లక్షల ఇన్ ఫ్లో 26 గేట్లు ఓపెన్నా. గార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి ఏకంగా 5 లక్షల 40 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. నాగార్జునసాగర్ జలాశయం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 26 క్రస్ట్ గేట్లలో 14 గేట్లను 10 అడుగుల మేర, 12 గేట్లను పదిహేను అడుగుల మేరకు ఎత్తి స్పిల్వే ద్వారా 4 లక్షల 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో ఎగువ నుంచి వచ్చే వరదను, అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతుంది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా కాగా ప్రస్తుతం 588.90 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గానూ, ప్రస్తుత నీటినిల్వ 308.7614 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహంను బట్టి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు.
నాగార్జున సాగర్ జలాశయం కు ఇంత మొత్తం లో వరద ప్రవాహం రావడం 2019 తరువాత ఇదే అని అధికారులు చెబుతున్నారు.26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేయడం ఇది మూడవ రోజు. కృష్ణ దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
What's Your Reaction?