Nagarjuna Sagar : నాగార్జున సాగర్ 25 గేట్లు ఓపెన్.. పర్యాటకుల సందడి
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉదృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టు 25 గేట్లను ఐదు అడుగుల మేర పైకి ఎత్తి,1 లక్షా 62వేల క్యూసెక్కుల నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. దీంతో పాటు కుడి ఎడమ కాలువలు, ప్రధాన జల విద్యుత్ ఉత్పాదన ద్వారా 48వేల 508 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు డ్యాం అధికారులు. మొత్తం ఇన్ ఫ్లో 2లక్షల10 వేల 508 క్యూసెక్కులు వస్తుండగా.. అదే ఇన్ ఫ్లో ను ఔట్ ఫ్లో గా దిగువకు వదిలేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు గానే కొనసాగుతోంది.సాగర్ గేట్లు ఫుల్ గా ఓపెన్ చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. జల సోయగాన్ని చూసి తన్మయత్వం చెందుతున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉదృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టు 25 గేట్లను ఐదు అడుగుల మేర పైకి ఎత్తి,1 లక్షా 62వేల క్యూసెక్కుల నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. దీంతో పాటు కుడి ఎడమ కాలువలు, ప్రధాన జల విద్యుత్ ఉత్పాదన ద్వారా 48వేల 508 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు డ్యాం అధికారులు.
మొత్తం ఇన్ ఫ్లో 2లక్షల10 వేల 508 క్యూసెక్కులు వస్తుండగా.. అదే ఇన్ ఫ్లో ను ఔట్ ఫ్లో గా దిగువకు వదిలేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు గానే కొనసాగుతోంది.
సాగర్ గేట్లు ఫుల్ గా ఓపెన్ చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. జల సోయగాన్ని చూసి తన్మయత్వం చెందుతున్నారు.
What's Your Reaction?