Nagarjuna Sagar : నాగార్జున సాగర్ మధ్యలో సూపర్ టూరిజం
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం మధ్యలో ఉన్న చాకలి గట్టు, ఏలేశ్వరం కొండపై ఎకో టూరిజం అభివృద్ధికి టూరిజం ఉన్నతాధికారులు స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, పురావస్తు శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ ఆధ్వర్యంలో టూరిజం లాంచిలో చాకలి గట్టు చేరుకొని ఎకో టూరిజం అభివృద్ధిని పరిశీలించారు. నాగార్జునసాగర్ జలాశయంలో తెలంగాణ అటవీశాఖ సాగర్ డివిజన్ పరిధిలో ఉన్న 415 ఎకరాల వైశాల్యం గల చాకలి గట్టుపై గత కొన్ని రోజులుగా నాగార్జునకొండ, బుద్ధ వనంతో పాటు చాకలి గట్టుపై టూరిజాన్ని అభివృద్ధి చేయాలని చాలాకాలంగా ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అయితే అవి అమలులోకి రాలేదు. తాజాగా పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు చాకలి గట్టును పరిశీలించారు. బుద్ధవనం ప్రాజెక్టును మరింత ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడానికి చేపట్టాల్సిన ప్రణాళిక గురించి చర్చించారు. చాకలి గట్టుపై బోటింగ్ అవకాశాలు, వాటర్ స్పోర్ట్స్, క్యాంపింగ్ లాంటివి ఏర్పాటుకై అటవీశాఖ ఉన్నతాధికారులతో కలిసి సమావేశమై పూర్తిస్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. బుద్ధ వనంలో మరిన్ని నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం మధ్యలో ఉన్న చాకలి గట్టు, ఏలేశ్వరం కొండపై ఎకో టూరిజం అభివృద్ధికి టూరిజం ఉన్నతాధికారులు స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, పురావస్తు శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ ఆధ్వర్యంలో టూరిజం లాంచిలో చాకలి గట్టు చేరుకొని ఎకో టూరిజం అభివృద్ధిని పరిశీలించారు.
నాగార్జునసాగర్ జలాశయంలో తెలంగాణ అటవీశాఖ సాగర్ డివిజన్ పరిధిలో ఉన్న 415 ఎకరాల వైశాల్యం గల చాకలి గట్టుపై గత కొన్ని రోజులుగా నాగార్జునకొండ, బుద్ధ వనంతో పాటు చాకలి గట్టుపై టూరిజాన్ని అభివృద్ధి చేయాలని చాలాకాలంగా ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అయితే అవి అమలులోకి రాలేదు. తాజాగా పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు చాకలి గట్టును పరిశీలించారు.
బుద్ధవనం ప్రాజెక్టును మరింత ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడానికి చేపట్టాల్సిన ప్రణాళిక గురించి చర్చించారు. చాకలి గట్టుపై బోటింగ్ అవకాశాలు, వాటర్ స్పోర్ట్స్, క్యాంపింగ్ లాంటివి ఏర్పాటుకై అటవీశాఖ ఉన్నతాధికారులతో కలిసి సమావేశమై పూర్తిస్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. బుద్ధ వనంలో మరిన్ని నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
What's Your Reaction?