Nagarjuna : కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటా : నాగార్జున
కోర్టు ఇచ్చే తీర్పునకు కట్టుబడి ఉంటానని.. అప్పటివరకు ఎలాంటి వదంతులు, అవాస్తవాలు నమ్మొద్దని ‘ఎన్’ కన్వెన్షన్ సెంటర్ ఓనర్, సినీ నటుడు నాగార్జున విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులకు.. ఎన్- కన్వెన్షన్‌కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పట్టా భూమిలోనే కన్వెన్షన్ నిర్మించాం. ఒక్క సెంట్ కూడా ఆక్రమించలేదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు, ఏపీ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ 24-02-2014న ఓ ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రస్తుతం.. నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించాం. న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటాను. అవాస్తవాలు నమ్మకండి’అని ట్వీట్ చేశారు..‘ఎన్’ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేతపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మాదాపూర్‌లో ‘ఎన్’ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన ప్రాంతాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాద్ధాంతం చేస్తారు. నాగార్జున బిగ్ బాస్‌కే బాస్. చెరువుని ఆక్రమించుకుని కబ్జాలు చేశారు. ఆయనేం సత్యహరిశ్చంద్రుడు కాదు. ఎన్ కన్వెన్షన్ మీద రోజుకు రూ.లక్షల ఆదాయం వస్తోంది. చాలా డబ్బులు ఉన్నాయి.ఆయనకు ఇదంతా లెక్క కాదు. సినిమా డైలాగ్‌లు పనికిరావు. ఒక్కడే కూర్చుని వందమందిని కొట్టేస్తే కుదరదు. రోజుకు ఎంత సంపాదించాడో కక్కించాలి. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెరువులో కాలేజీలు కట్టారు. వారంతా కబ్జాకోరులు. ఫిరంగి నాలాను కబ్జా చేశారు. చెరువులు, నాలాలు కబ్జా అయితే ఊర్లు మునిగిపోతాయి. ఆరంభ శూరత్వం కాదు.. ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలి. పెద్దలు కబ్జాలు చేసినా, దొంగపట్టాలు పొందినా వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. రాజకీయ కక్ష సాధింపు అవసరం లేదు. ఒకే పార్టీ, ఒకే వర్గం మీద కక్ష సాధింపు మంచిది కాదు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు చేపట్టాలి. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగాలి. ఎంఐఎం వారివి కూడా తొలగించాలి. అక్రమ నిర్మాణాలకు ఎవరు అనుమతిచ్చారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. మేం మొదటి నుంచి భూ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నాం’అని నారాయణ అన్నారు.
కోర్టు ఇచ్చే తీర్పునకు కట్టుబడి ఉంటానని.. అప్పటివరకు ఎలాంటి వదంతులు, అవాస్తవాలు నమ్మొద్దని ‘ఎన్’ కన్వెన్షన్ సెంటర్ ఓనర్, సినీ నటుడు నాగార్జున విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులకు.. ఎన్- కన్వెన్షన్‌కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పట్టా భూమిలోనే కన్వెన్షన్ నిర్మించాం. ఒక్క సెంట్ కూడా ఆక్రమించలేదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు, ఏపీ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ 24-02-2014న ఓ ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రస్తుతం.. నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించాం. న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటాను. అవాస్తవాలు నమ్మకండి’అని ట్వీట్ చేశారు..
‘ఎన్’ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేతపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మాదాపూర్‌లో ‘ఎన్’ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన ప్రాంతాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాద్ధాంతం చేస్తారు. నాగార్జున బిగ్ బాస్‌కే బాస్. చెరువుని ఆక్రమించుకుని కబ్జాలు చేశారు. ఆయనేం సత్యహరిశ్చంద్రుడు కాదు. ఎన్ కన్వెన్షన్ మీద రోజుకు రూ.లక్షల ఆదాయం వస్తోంది. చాలా డబ్బులు ఉన్నాయి.ఆయనకు ఇదంతా లెక్క కాదు. సినిమా డైలాగ్‌లు పనికిరావు. ఒక్కడే కూర్చుని వందమందిని కొట్టేస్తే కుదరదు. రోజుకు ఎంత సంపాదించాడో కక్కించాలి.
మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెరువులో కాలేజీలు కట్టారు. వారంతా కబ్జాకోరులు. ఫిరంగి నాలాను కబ్జా చేశారు. చెరువులు, నాలాలు కబ్జా అయితే ఊర్లు మునిగిపోతాయి. ఆరంభ శూరత్వం కాదు.. ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలి. పెద్దలు కబ్జాలు చేసినా, దొంగపట్టాలు పొందినా వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. రాజకీయ కక్ష సాధింపు అవసరం లేదు. ఒకే పార్టీ, ఒకే వర్గం మీద కక్ష సాధింపు మంచిది కాదు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు చేపట్టాలి. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగాలి. ఎంఐఎం వారివి కూడా తొలగించాలి. అక్రమ నిర్మాణాలకు ఎవరు అనుమతిచ్చారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. మేం మొదటి నుంచి భూ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నాం’అని నారాయణ అన్నారు.
What's Your Reaction?