Nalgonda: కూర్చున్న కుర్చీలోనే మహిళ డెలివరీ..
నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
సిబ్బంది నిర్లక్ష్యంతో కుర్చీలోనే గర్భిణి ప్రసవించిన ఘటన నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నేరేడుగొమ్మ మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని తన భర్తతో కలిసి గురువారం రాత్రి ప్రసవం కోసం దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో చేరింది. అక్కడి వైద్యులు మూడో కాన్పు చేయడం కుదరదంటూ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి సిఫార్సు చేశారు. దీంతో ఆమె గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నల్గొండ ఎంసీహెచ్‌లో చేరింది. వెంటనే బెడ్, ఇతర సౌకర్యాలు కల్పించకపోవడంతో కుర్చీలోనే కూర్చుని ఉంది. ఆ సమయంలోనే పురిటి నొప్పులు వచ్చి మగశిశువుకు జన్మనిచ్చింది. గమనించిన సిబ్బంది ఆమెను వార్డులోకి తీసుకెళ్లి చికిత్స అందించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో అశ్విని అనే మహిళ కుర్చీలోనే డెలివరీ అయింది. ఈరోజు తెల్లవారు జామున ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో వచ్చిన మహిళను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించింది. పురిటి నొప్పులు వస్తున్నాయని చెప్పినా సిబ్బంది ఆసుపత్రిలో చేర్చుకోవడానికి ఒప్పుకోకపోవడంతో.. గర్భిణీ అశ్వనీ కుర్చీలో కూర్చుండగానే తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో రక్తస్రావం చూసిన వైద్యులు, వైద్య సిబ్బంది ఒక్కసారిగా పరుగులు పెట్టి నానా హాంగామా చేశారు. గర్భిణీ పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తక్షణమే వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు హస్పటల్ ముందు ఆందోళనకు దిగారు.
What's Your Reaction?