Nani : సరిపోదా శనివారం ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అవుతుందా..

నేచురల్ స్టార్ నాని మూవీ సరిపోదా శనివారంపైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. కల్కి తర్వాత మధ్యలో వచ్చిన కమిటీ కుర్రోళ్లు, ఆయ్ మూవీస్ తప్ప బాక్సాఫీస్ కు కళ తెచ్చే కమర్షియల్ సినిమానే పడలేదు ఇంత వరకూ. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలు బాగా ఫెయిల్ అవుతున్నారీ మధ్య. ఇక ఆగస్ట్ నుంచీ అంతా మారుతుంది అనుకుంటే అదీ జరగలేదు. అందుకే ఈ నెలను బ్లాక్ బస్టర్ టాక్ తో ఫినిష్ చేస్తాడా నాని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. నానితో గ్యాంగ్ లీడర్ లో పెయిర్ గా నటించిన ప్రియాంక మోహన్ మరోసారి అతనితో జోడీ కట్టింది. నాని చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా కనిపించిన అంటే సుందరానికి మూవీ తర్వాత ఆ దర్శకుడు వివేక్ ఆత్రేయకు ఇచ్చిన మరో అవకాశమే సరిపోదా శనివారం. ఇక తమిళ్ లో అతనుంటే హిట్ అనే రేంజ్ టాక్, ఇమేజ్ తెచ్చుకున్నాడు ఎస్.జే సూర్య.వివేక్ నాని నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ప్రియాంకతో జోడీ కడితే హిట్ రాదేమో అన్న డౌట్స్ క్రియేట్ కాకుండా చూసుకోవాలి. సూర్య తెలుగులో నటించినా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ స్టార్ట్ కావాలి. ఇవన్నీ జరగాలి అంటే సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవాలి. అప్పుడే సరిపోదా శనివారం ఆగస్ట్ నెలను గ్రాండ్ గా ఎండ్ చేస్తుంది. అలా కాకున్నా.. ఇక సెప్టెంబర్ నుంచి అన్నీ పెద్ద సినిమాలే రాబోతున్నాయి. ఈ తరుణంలో రిజల్ట్స్ తో పనిలేకుండా అన్ని థియేటర్స్ వద్ద సందడి కనిపిస్తుంది. ఆ సందడికి నాందిగానూ సరిపోదా శనివారం నిలవాలి. అలా నిలుస్తుందా లేదా అనే ఆసక్తితోనే అందరూ ఇప్పుడు సరిపోదా శనివారం అంచనాలను అందుకుంటుందా లేదా అని చూస్తున్నారు. మరి జరుగుతుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుందేమో కదా..

Aug 28, 2024 - 17:07
 0  4
Nani : 
సరిపోదా శనివారం ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అవుతుందా..

నేచురల్ స్టార్ నాని మూవీ సరిపోదా శనివారంపైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. కల్కి తర్వాత మధ్యలో వచ్చిన కమిటీ కుర్రోళ్లు, ఆయ్ మూవీస్ తప్ప బాక్సాఫీస్ కు కళ తెచ్చే కమర్షియల్ సినిమానే పడలేదు ఇంత వరకూ. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలు బాగా ఫెయిల్ అవుతున్నారీ మధ్య. ఇక ఆగస్ట్ నుంచీ అంతా మారుతుంది అనుకుంటే అదీ జరగలేదు. అందుకే ఈ నెలను బ్లాక్ బస్టర్ టాక్ తో ఫినిష్ చేస్తాడా నాని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. నానితో గ్యాంగ్ లీడర్ లో పెయిర్ గా నటించిన ప్రియాంక మోహన్ మరోసారి అతనితో జోడీ కట్టింది. నాని చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా కనిపించిన అంటే సుందరానికి మూవీ తర్వాత ఆ దర్శకుడు వివేక్ ఆత్రేయకు ఇచ్చిన మరో అవకాశమే సరిపోదా శనివారం. ఇక తమిళ్ లో అతనుంటే హిట్ అనే రేంజ్ టాక్, ఇమేజ్ తెచ్చుకున్నాడు ఎస్.జే సూర్య.

వివేక్ నాని నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ప్రియాంకతో జోడీ కడితే హిట్ రాదేమో అన్న డౌట్స్ క్రియేట్ కాకుండా చూసుకోవాలి. సూర్య తెలుగులో నటించినా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ స్టార్ట్ కావాలి. ఇవన్నీ జరగాలి అంటే సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవాలి. అప్పుడే సరిపోదా శనివారం ఆగస్ట్ నెలను గ్రాండ్ గా ఎండ్ చేస్తుంది. అలా కాకున్నా.. ఇక సెప్టెంబర్ నుంచి అన్నీ పెద్ద సినిమాలే రాబోతున్నాయి. ఈ తరుణంలో రిజల్ట్స్ తో పనిలేకుండా అన్ని థియేటర్స్ వద్ద సందడి కనిపిస్తుంది. ఆ సందడికి నాందిగానూ సరిపోదా శనివారం నిలవాలి. అలా నిలుస్తుందా లేదా అనే ఆసక్తితోనే అందరూ ఇప్పుడు సరిపోదా శనివారం అంచనాలను అందుకుంటుందా లేదా అని చూస్తున్నారు. మరి జరుగుతుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుందేమో కదా..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News