Nani, Venu : నాని, బలగం వేణు సినిమా ఎందుకు ఆగింది
మొన్నటి వరకూ ఓ సాధారణ కమెడియన్ గా ఉన్నాడు వేణు. అందులోనూ పెద్ద స్టార్డమ్ అంటూ ఏం లేదు. అలాంటి వేణును దర్శకుడుగా నమ్మిన దిల్ రాజు అందరినీ ఆశ్చర్యపరిచాడు. వేణు దిల్ రాజు నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఈ డెకేడ్ లోనే బెస్ట్ మూవీ అని నాని లాంటి స్టార్ హీరో అనేంత గొప్ప ఎమోషనల్ మూవీ తీశాడు. ముఖ్యంగా బలగం మూవీ చివరి 20 నిమిషాలు చూసి కన్నీళ్లు పెట్టని వారు లేరు. ఎప్పుడో అంతరించిపోయిన గ్రామాల్లోని తెరబొమ్మలు అనే సంప్రదాయాన్ని మళ్లీ తెచ్చి.. ఒక పెద్ద టివి పెట్టుకుని ఊరంతా చూసి వలపోత పెట్టుకున్న సందర్భం మళ్లీ బలగంతో చూశాం. అందుకే అప్పటి నుంచి వేణుతో ఓ సినిమా చేయాలని నాని ఫిక్స్ అయ్యాడు. అతను దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. అది వేణుతోనే అని ఫిక్స్ అయ్యాడు. ఆ మధ్య వేణు ఓ లైన్ చెప్పాడు నాని ఓకే చేశాడు అనే వార్తలు కూడా వచ్చాయి. మరి ఏమైందో.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.ఇదే విషయం నానిని అడిగితే.. వేణుతో ఖచ్చితంగా సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు. కానీ ఇప్పుడే కాదట. ప్రస్తుతం వేణు మరో కథతో వేరే హీరోతో మూవీ ప్లాన్ చేసుకుంటున్నాడట. అదయ్యాక లేదంటే తనకు బాగా నచ్చే కథ తెచ్చాక వేణుతో మూవీ ఉంటుందని చెప్పాడు నాని. వేణు రెండో సినిమా కూడా తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపథ్యంలోనే ఉంటుందట. ఈ విషయం కూడా నానీయే చెప్పడం విశేషం. ఆ కథలో నితిన్, శర్వానంద్ వంటి వాళ్లైతే ఇంకా బావుంటుందని చెబుతున్నాడు. మొత్తంగా వేణు రెండో సినిమా నానితోనే ఉండాలి. కానీ అతనికి నచ్చే కథ ప్రస్తుతం వేణు వద్ద లేదు. అందుకే ఈ కాంబినేషన్ లో సినిమా ఆలస్యం అవుతోంది. అదీ మేటర్.
మొన్నటి వరకూ ఓ సాధారణ కమెడియన్ గా ఉన్నాడు వేణు. అందులోనూ పెద్ద స్టార్డమ్ అంటూ ఏం లేదు. అలాంటి వేణును దర్శకుడుగా నమ్మిన దిల్ రాజు అందరినీ ఆశ్చర్యపరిచాడు. వేణు దిల్ రాజు నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఈ డెకేడ్ లోనే బెస్ట్ మూవీ అని నాని లాంటి స్టార్ హీరో అనేంత గొప్ప ఎమోషనల్ మూవీ తీశాడు. ముఖ్యంగా బలగం మూవీ చివరి 20 నిమిషాలు చూసి కన్నీళ్లు పెట్టని వారు లేరు. ఎప్పుడో అంతరించిపోయిన గ్రామాల్లోని తెరబొమ్మలు అనే సంప్రదాయాన్ని మళ్లీ తెచ్చి.. ఒక పెద్ద టివి పెట్టుకుని ఊరంతా చూసి వలపోత పెట్టుకున్న సందర్భం మళ్లీ బలగంతో చూశాం. అందుకే అప్పటి నుంచి వేణుతో ఓ సినిమా చేయాలని నాని ఫిక్స్ అయ్యాడు. అతను దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. అది వేణుతోనే అని ఫిక్స్ అయ్యాడు. ఆ మధ్య వేణు ఓ లైన్ చెప్పాడు నాని ఓకే చేశాడు అనే వార్తలు కూడా వచ్చాయి. మరి ఏమైందో.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఇదే విషయం నానిని అడిగితే.. వేణుతో ఖచ్చితంగా సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు. కానీ ఇప్పుడే కాదట. ప్రస్తుతం వేణు మరో కథతో వేరే హీరోతో మూవీ ప్లాన్ చేసుకుంటున్నాడట. అదయ్యాక లేదంటే తనకు బాగా నచ్చే కథ తెచ్చాక వేణుతో మూవీ ఉంటుందని చెప్పాడు నాని. వేణు రెండో సినిమా కూడా తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపథ్యంలోనే ఉంటుందట. ఈ విషయం కూడా నానీయే చెప్పడం విశేషం. ఆ కథలో నితిన్, శర్వానంద్ వంటి వాళ్లైతే ఇంకా బావుంటుందని చెబుతున్నాడు.
మొత్తంగా వేణు రెండో సినిమా నానితోనే ఉండాలి. కానీ అతనికి నచ్చే కథ ప్రస్తుతం వేణు వద్ద లేదు. అందుకే ఈ కాంబినేషన్ లో సినిమా ఆలస్యం అవుతోంది. అదీ మేటర్.
What's Your Reaction?