Nani : అవి రూమరే.. నాని క్లారిటీ

నేచురల్ స్టార్ నాని.. తదుపరి సినిమాలో హీరోయిన్ గా జాన్వీకపూర్ నటించనుందనే వార్తలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను (హిట్ 3) లేదా సుజిత్ దర్శకత్వంలో నాని నటించనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్లో స్టార్ అయిన జాన్వీ కపూర్.. టాలీవుడ్లోనూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర'లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న మొదటి పార్ట్ విడుదల కానుంది. అయితే నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిపోదా శనివారం' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ భాగంగా నాని ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూల్లో బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. తన తర్వాతి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుందన్న వార్తలపై స్పందించారు. మీ తర్వాతి సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందట కదా?, నిజమేనా? అని అడగగా.. ‘నా తదుపరి సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుందనేది కేవలం రూమర్ మాత్రమే. బహుశా జాన్వీని తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నేను కొన్ని రోజులుగా వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నాను. కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియదు' అని నాని సమాధానం ఇచ్చారు.

Aug 28, 2024 - 09:32
 0  4

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News