Nani : సరిపోదా శనివారంకు ఊహించని సమస్యలు
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ నటించిన సరిపోదా శనివారం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఎస్.జే సూర్య పాత్ర అత్యంత కీలకం అని అన్ని ప్రమోషన్స్ లో చెబుతున్నారు మేకర్స్. సరిపోదా శనివారంలో ఆయన పాత్రే హైలెట్ అవుతుందని స్వయంగా నానియే చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగింది. సూర్య ఈ మూవీలో దయా అనే పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. అతను పనిచేసే స్టేషన్ లోనే కానిస్టేబుల్ చారులతగా ప్రియాంక నటించింది. పెద్దగా అంచనాలు లేకుండానే ఆడియన్స్ ముందుకు రాబోతోందీ మూవీ. ఇక రిలీజ్ కు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ సినిమాకు షాక్ ఇచ్చింది పివిఆర్ అండ్ ఐనాక్స్ మూవీ చైన్స్. ఈ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో పాటు అన్ని బుకింగ్స్ ను రిమూవ్ చేశారు. దీంతో టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటోన్న ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. అసలు ఏం జరుగుతుంది అంటూ మేకర్స్ కు ఇన్ఫార్మ్ చేశారు.పివిఆర్, ఐనాక్స్ థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ తోనే టికెట్స్ బుకింగ్ ఆప్షన్స్ ను తొలగించారని సమాచారం. దీంతో నిర్మాతలు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది కేవలం తెలుగు స్టేట్స్ లోనే కనిపిస్తోన్న సమస్యగా ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ థియేటర్ చైన్ నుంచి ఇష్యూస్ కనిపించడం లేదు. అదే సమయంల ఆ ప్రాంతాల్లో టికెట్స్ కోసం ఇంత రష్ కూడా లేదు. మొత్తంగా రిలీజ్ ముందు ఇలాంటి సమస్యలు రావడం మూవీ ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుంది. అలాగే ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో కూడా తేడాలొస్తాయి. మరి ఈ ఇష్యూ సాయంత్రం వరకైనా సాల్వ్ అవుతుందా లేదా అనేది చూడాలి.
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ నటించిన సరిపోదా శనివారం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఎస్.జే సూర్య పాత్ర అత్యంత కీలకం అని అన్ని ప్రమోషన్స్ లో చెబుతున్నారు మేకర్స్. సరిపోదా శనివారంలో ఆయన పాత్రే హైలెట్ అవుతుందని స్వయంగా నానియే చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగింది. సూర్య ఈ మూవీలో దయా అనే పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. అతను పనిచేసే స్టేషన్ లోనే కానిస్టేబుల్ చారులతగా ప్రియాంక నటించింది. పెద్దగా అంచనాలు లేకుండానే ఆడియన్స్ ముందుకు రాబోతోందీ మూవీ. ఇక రిలీజ్ కు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ సినిమాకు షాక్ ఇచ్చింది పివిఆర్ అండ్ ఐనాక్స్ మూవీ చైన్స్. ఈ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో పాటు అన్ని బుకింగ్స్ ను రిమూవ్ చేశారు. దీంతో టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటోన్న ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. అసలు ఏం జరుగుతుంది అంటూ మేకర్స్ కు ఇన్ఫార్మ్ చేశారు.
పివిఆర్, ఐనాక్స్ థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ తోనే టికెట్స్ బుకింగ్ ఆప్షన్స్ ను తొలగించారని సమాచారం. దీంతో నిర్మాతలు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది కేవలం తెలుగు స్టేట్స్ లోనే కనిపిస్తోన్న సమస్యగా ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ థియేటర్ చైన్ నుంచి ఇష్యూస్ కనిపించడం లేదు. అదే సమయంల ఆ ప్రాంతాల్లో టికెట్స్ కోసం ఇంత రష్ కూడా లేదు. మొత్తంగా రిలీజ్ ముందు ఇలాంటి సమస్యలు రావడం మూవీ ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుంది. అలాగే ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో కూడా తేడాలొస్తాయి. మరి ఈ ఇష్యూ సాయంత్రం వరకైనా సాల్వ్ అవుతుందా లేదా అనేది చూడాలి.
What's Your Reaction?