Nara Rohith Sundarakanda : ప్రామిసింగ్ గా సుందరకాండ టీజర్
నారా రోహిత్ హీరోగా నటిస్తోన్న సినిమా సుందరకాండ. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు. శ్రీదేవి, వృతి వాఘాని, నరేష్, వాసుకి కీలక పాత్రల్లో నటించారు. తాజాగా సుందరకాండ టీజర్ విడుదలైంది. మామూలుగా నారా రోహిత్ సినిమాలంటే కాస్త సీరియస్ లుక్ తో కనిపిస్తాయి. కంటెంట్ బేస్డ్ గా ఉంటాయి. ఆ మధ్య కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ ప్రతినిధి 2 తో రీ స్టార్ట్ అయ్యాడు. ఈ సీక్వెల్ బాగా ఆకట్టుకుంది. ఈ సుందరకాండ టీజర్ చూస్తే రోహిత్ రూట్ మార్చాడు అనిపిస్తోంది.టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంది. పెళ్లికాని ప్రసాద్ లాంటి కథే అయినా.. ఈ జెనరేషన్ కు తగ్గట్టుగా కనిపిస్తోంది. హిలేరియస్ ఎంటర్టైనర్ లా ఉంది. అందుకు తగ్గట్టుగానే పాత్రధారులు కూడా కనిపిస్తున్నారు. రోహిత్ ఇంతకు ముందెప్పుడూ కనిపించనంత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. బాగా సన్నబడ్డాడు కూడా. చాలా వయసుకు వచ్చినా.. ఇంకా పెళ్లి కాకపోవడానికి కారణాలేంటీ అనేది తెరపైనే చూడాలి. కానీ హీరోయిన్ అంటూ పర్టిక్యులర్ గా కనిపించిన ఈ టీజర్ లో మాజీ హీరోయిన్.. తమిళ్ డైరెక్టర్ హరి భార్య శ్రీదేవి ఆ ప్లేస్ లో కనిపిస్తుండటం మాత్రం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ‘‘నాది మూలా నక్షత్రం.. ఐదు నిమిషాలకు మించి హ్యాపీగా ఉండలేదు,‘ మా వాడిలో ప్రాబ్లమ్ ఏం లేదండీ.. మా వాడితోనే ప్రాబ్లమ్, వీడికి ఒకటీ రెండు కాదు.. ఐదు కావాలి, వీడికి ఇన్నేళ్లు పెళ్లి కాలేదంటే పోనీలో పాపం అనుకున్నా.. ఇన్ని పాపాలు చేసినందుకు అనుకోలేదు.. ’’ వంటి డైలాగ్స్ టీజర్ లోనే హైలెట్ గా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గ్యారెంటీ అనిపిస్తోంది. మొత్తంగా రూట్ మార్చిన రోహిత్ ఈ సారి సాఫ్ట్ గా వస్తున్నాడన్నమాట.
నారా రోహిత్ హీరోగా నటిస్తోన్న సినిమా సుందరకాండ. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు. శ్రీదేవి, వృతి వాఘాని, నరేష్, వాసుకి కీలక పాత్రల్లో నటించారు. తాజాగా సుందరకాండ టీజర్ విడుదలైంది. మామూలుగా నారా రోహిత్ సినిమాలంటే కాస్త సీరియస్ లుక్ తో కనిపిస్తాయి. కంటెంట్ బేస్డ్ గా ఉంటాయి. ఆ మధ్య కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ ప్రతినిధి 2 తో రీ స్టార్ట్ అయ్యాడు. ఈ సీక్వెల్ బాగా ఆకట్టుకుంది. ఈ సుందరకాండ టీజర్ చూస్తే రోహిత్ రూట్ మార్చాడు అనిపిస్తోంది.
టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంది. పెళ్లికాని ప్రసాద్ లాంటి కథే అయినా.. ఈ జెనరేషన్ కు తగ్గట్టుగా కనిపిస్తోంది. హిలేరియస్ ఎంటర్టైనర్ లా ఉంది. అందుకు తగ్గట్టుగానే పాత్రధారులు కూడా కనిపిస్తున్నారు. రోహిత్ ఇంతకు ముందెప్పుడూ కనిపించనంత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. బాగా సన్నబడ్డాడు కూడా. చాలా వయసుకు వచ్చినా.. ఇంకా పెళ్లి కాకపోవడానికి కారణాలేంటీ అనేది తెరపైనే చూడాలి. కానీ హీరోయిన్ అంటూ పర్టిక్యులర్ గా కనిపించిన ఈ టీజర్ లో మాజీ హీరోయిన్.. తమిళ్ డైరెక్టర్ హరి భార్య శ్రీదేవి ఆ ప్లేస్ లో కనిపిస్తుండటం మాత్రం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.
‘‘నాది మూలా నక్షత్రం.. ఐదు నిమిషాలకు మించి హ్యాపీగా ఉండలేదు,‘ మా వాడిలో ప్రాబ్లమ్ ఏం లేదండీ.. మా వాడితోనే ప్రాబ్లమ్, వీడికి ఒకటీ రెండు కాదు.. ఐదు కావాలి, వీడికి ఇన్నేళ్లు పెళ్లి కాలేదంటే పోనీలో పాపం అనుకున్నా.. ఇన్ని పాపాలు చేసినందుకు అనుకోలేదు.. ’’ వంటి డైలాగ్స్ టీజర్ లోనే హైలెట్ గా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గ్యారెంటీ అనిపిస్తోంది. మొత్తంగా రూట్ మార్చిన రోహిత్ ఈ సారి సాఫ్ట్ గా వస్తున్నాడన్నమాట.
What's Your Reaction?