Narayana | త్వరలోనే చెత్త పన్ను రద్దు.. ఏపీ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
Narayana | వైసీపీ పాలనలో అవినీతి కొత్త పుంతలు తొక్కిందని మంత్రి నారాయణ అన్నారు. టీడీఆర్ బాండ్ల రూపంలో రూ.వేల కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖల వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయని అన్నారు.
Narayana | వైసీపీ పాలనలో అవినీతి కొత్త పుంతలు తొక్కిందని మంత్రి నారాయణ అన్నారు. టీడీఆర్ బాండ్ల రూపంలో రూ.వేల కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖల వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయని అన్నారు. మున్సిపల్ శాఖలోని సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్తపన్నును కూడా త్వరలోనే రద్దు చేస్తామని తెలిపారు.
తిరుపతి నగరపాలిక, పట్టణాభివృద్ది అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. తిరుపతిలో తాగునీటి సరఫరా, యూడీఎస్‌ల పనితీరుపై సమీక్ష చేశారు. కండలేరు, బాలాజీ జలాశయాల్లో నీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి వాసులకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తాగునీటిని వారానికి ఒకసారి పరీక్షించాలని సూచించారు. టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీ వేశామని మంత్రి నారాయణ తెలిపారు. కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సెప్టెంబర్ చివరి నాటికి టీడీఆర్ బాండ్ల అక్రమాలను తేలుస్తామని స్పష్టం చేశారు.
2014-19 మధ్య ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అభివృద్ధి జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర నిధులకు రాష్ట్ర వాటా కేటాయించలేదని ఆరోపించారు. 2023-24లో కేంద్రం కేటాయించిన నిధులను దారిమళ్లించారని అన్నారు. తుడాలో జీతాల కోసమే రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఏ అభివృద్ధి సంస్థకూ లేని రీతిలో తుడాలో ఖర్చులు చేశారని మండిపడ్డారు. ఉద్యోగులను నియమించి సొంత పనులకు వాడుకున్నారని అన్నారు. ఉద్యోగ నియామకాలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అగ్నిమాపక, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలతో తమ శాఖ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానిస్తామని పేర్కొన్నారు. ప్రజలను తిప్పకుండా వీలైనంత తొందరగా అనుమతులు ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు.
What's Your Reaction?