NASA : మరో ఆరు నెలల పాటు ISS లోనే సునీతా విలియమ్స్

భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌లు మరో ఆరు నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోనే ఉండనున్నారు. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్‌ క్రాఫ్ట్‌ను కేవలం 10 రోజుల అంతరిక్ష యాత్ర కోసం ఈ ఏడాది జూన్ 5న ప్రయోగించారు. అయితే అందులోని థ్రస్టర్ పనితీరు దెబ్బతింది. హీలియం లీకేజీ జరుగుతోంది. ఈ సమస్యల కారణంగా స్టార్ లైనర్ స్పేస్‌ క్రాఫ్ట్‌ను తాత్కాలికంగా ISSకు అటాచ్ చేశారు. ISS నుంచి ఇప్పుడు సునితా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్‌లకు అన్ని రకాల సౌకర్యాలు అందుతున్నాయి. వారు అక్కడికి చేరుకొని ఇప్పటికే 80 రోజులు దాటిపోయింది.అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆ ఇద్దరు వ్యోమగాములు భూమికి తిరిగొచ్చేది వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే అని ప్రకటించింది. అంటే మరో 200 రోజుల పాటు సునితా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్‌ అక్కడే ఉండాల్సి వస్తుంది. దీంతో వారిద్దరి ఆరోగ్య భద్రత, స్టార్ లైనర్ స్పేస్‌ క్రాఫ్ట్‌ పునరుద్ధరణపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తరఫున క్రూ-9 మిషన్ ద్వారా పలువురు వ్యోమగాములు ఈ ఏడాది సెప్టెంబరు 24న అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. వారంతా 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో భూమికి తిరిగి రానున్నారు. ఆ టైంలో వారితోపాటు కలిసి సునితా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్‌ భూమికి తిరిగి వచ్చేస్తారని నాసా వెల్లడించింది. స్టార్ లైనర్ వ్యోమనౌకను సిబ్బంది లేకుండానే నేవిగేట్ చేస్తూ భూమికి తీసుకురానున్నట్లు తెలిపింది.

Aug 25, 2024 - 23:06
Aug 25, 2024 - 23:22
 0  1
NASA : మరో ఆరు నెలల పాటు ISS లోనే సునీతా విలియమ్స్

భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌లు మరో ఆరు నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోనే ఉండనున్నారు. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్‌ క్రాఫ్ట్‌ను కేవలం 10 రోజుల అంతరిక్ష యాత్ర కోసం ఈ ఏడాది జూన్ 5న ప్రయోగించారు. అయితే అందులోని థ్రస్టర్ పనితీరు దెబ్బతింది. హీలియం లీకేజీ జరుగుతోంది.

ఈ సమస్యల కారణంగా స్టార్ లైనర్ స్పేస్‌ క్రాఫ్ట్‌ను తాత్కాలికంగా ISSకు అటాచ్ చేశారు. ISS నుంచి ఇప్పుడు సునితా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్‌లకు అన్ని రకాల సౌకర్యాలు అందుతున్నాయి. వారు అక్కడికి చేరుకొని ఇప్పటికే 80 రోజులు దాటిపోయింది.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆ ఇద్దరు వ్యోమగాములు భూమికి తిరిగొచ్చేది వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే అని ప్రకటించింది. అంటే మరో 200 రోజుల పాటు సునితా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్‌ అక్కడే ఉండాల్సి వస్తుంది. దీంతో వారిద్దరి ఆరోగ్య భద్రత, స్టార్ లైనర్ స్పేస్‌ క్రాఫ్ట్‌ పునరుద్ధరణపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తరఫున క్రూ-9 మిషన్ ద్వారా పలువురు వ్యోమగాములు ఈ ఏడాది సెప్టెంబరు 24న అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. వారంతా 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో భూమికి తిరిగి రానున్నారు. ఆ టైంలో వారితోపాటు కలిసి సునితా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్‌ భూమికి తిరిగి వచ్చేస్తారని నాసా వెల్లడించింది. స్టార్ లైనర్ వ్యోమనౌకను సిబ్బంది లేకుండానే నేవిగేట్ చేస్తూ భూమికి తీసుకురానున్నట్లు తెలిపింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News