National Space Day: నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం..
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 23) జరుపుకుంటోంది. గత ఏడాది ఇదే రోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ని ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైంది. జాతీయ అంతరిక్ష దినోత్సవం చంద్రయాన్-3 మిషన్ నుండి విక్రమ్ ల్యాండర్ విజయవంతమైన ల్యాండింగ్ ను సూచిస్తుంది. ఈ ముఖ్యమైన విజయాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం అధికారికంగా ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది.
పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన ఎన్నో భవిష్యత్తు నిర్ణయాలను తమ ప్రభుత్వ తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మునుముందు కూడా మరెన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రధాని తెలిపారు. అంతరిక్ష శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా మోదీ కొనియాడారు.
"మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అంతరిక్ష రంగంలో మన దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా గుర్తు చేసుకుంటున్నాం. మన అంతరిక్ష శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించే రోజు కూడా. మా ప్రభుత్వం ఈ రంగానికి సంబంధించి ఎన్నో భవిష్యత్ నిర్ణయాలను తీసుకుంది. రాబోయే రోజుల్లో మేము ఈ రంగం అభివృద్ధికి మరింత కృషి చేస్తాం"అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
What's Your Reaction?