Nithiin : శివకార్తికేయన్ సినిమాను కొన్న నితిన్
కోలీవుడ్ లో నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు శివకార్తికేయన్. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోగా అతనికి మంచి గుర్తింపు ఉంది. డబ్బింగ్ మూవీస్ తో అప్పుడప్పుడూ తెలుగు వారిని కూడా ఆకట్టుకుంటున్నాడు శివకార్తికేయన్. ఓ రకంగా ఇక్కడ కొంత మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు అనే చెప్పాలి. అతని నెక్ట్స్ మూవీ ‘అమరన్’. అక్టోబర్ 31న విడుదల కాబోతోందీ మూవీ. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి విడుదల చేయబోతున్నాడు.నితిన్ తండ్రి నిర్మాత మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్ కూడా. ఈయన గతంలో కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన విక్రమ్ సినిమాను ఇక్కడ విడుదల చేశాడు. విక్రమ్ సూపర్ హిట్ అయింది. విక్రమ్ నిర్మాణంలో కమల్ కూడా భాగస్వామి. అయితే అమరన్ ను నిర్మించింది కమల్ హాసన్ కు చెంది రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానరే. విక్రమ్ తో ఉన్న రిలేషన్ కారణంగా ఈ మూవీని కూడా నితిన్ వాళ్లకే ఇచ్చారు. ఈ మూవీకి ఉన్న మరో ఎసెట్ ఏంటంటే.. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి నటించింది. తనకు తెలుగులో తిరుగులేని క్రేజ్ ఉంది. పైగా తన సినిమా వచ్చి యేడాది దాటింది. అందువల్ల ఈ మూవీకి తెలుగులో సాయి పల్లవి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పాలి. ఇక అమరన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోంది.
కోలీవుడ్ లో నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు శివకార్తికేయన్. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోగా అతనికి మంచి గుర్తింపు ఉంది. డబ్బింగ్ మూవీస్ తో అప్పుడప్పుడూ తెలుగు వారిని కూడా ఆకట్టుకుంటున్నాడు శివకార్తికేయన్. ఓ రకంగా ఇక్కడ కొంత మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు అనే చెప్పాలి. అతని నెక్ట్స్ మూవీ ‘అమరన్’. అక్టోబర్ 31న విడుదల కాబోతోందీ మూవీ. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి విడుదల చేయబోతున్నాడు.
నితిన్ తండ్రి నిర్మాత మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్ కూడా. ఈయన గతంలో కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన విక్రమ్ సినిమాను ఇక్కడ విడుదల చేశాడు. విక్రమ్ సూపర్ హిట్ అయింది. విక్రమ్ నిర్మాణంలో కమల్ కూడా భాగస్వామి. అయితే అమరన్ ను నిర్మించింది కమల్ హాసన్ కు చెంది రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానరే. విక్రమ్ తో ఉన్న రిలేషన్ కారణంగా ఈ మూవీని కూడా నితిన్ వాళ్లకే ఇచ్చారు. ఈ మూవీకి ఉన్న మరో ఎసెట్ ఏంటంటే.. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి నటించింది. తనకు తెలుగులో తిరుగులేని క్రేజ్ ఉంది. పైగా తన సినిమా వచ్చి యేడాది దాటింది. అందువల్ల ఈ మూవీకి తెలుగులో సాయి పల్లవి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పాలి. ఇక అమరన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోంది.
What's Your Reaction?