Nitin Gadkari : యాక్సిడెంట్లలోనే ఎక్కువ మంది చనిపోతున్నరు : నితిన్ గడ్కరీ
యుద్ధాలు, టెర్రరిజం, నక్సలిజం ఘటనల్లో మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దేశంలో ఏటా లక్షల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్ ఇంజినీరింగ్ లోపాల కారణంగా ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఫిక్కీ రోడ్ సేఫ్టీ అవార్డ్స్, కాంక్లేవ్–2024లో గడ్కరీ పాల్గొని ప్రసంగించారు. ‘ యుద్ధాలు, ఉగ్రవాదం, నక్సలిజం ఘటనల్లో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. మూడు లక్షల మంది గాయపడుతున్నారు. దీంతో దేశ జీడీపీకి 3శాతం నష్టం వాటిల్లుతోంది. రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లను బలిపశువులను చేస్తారు.. కానీ, రోడ్ ఇంజినీరింగ్‌లోనూ లోపాలున్నాయి’అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.దేశంలోని అన్ని హైవేలకు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే.. లైనులో వెళ్లే క్రమశిక్షణ పాటించాలన్నారు. అంబులెన్సులు, వాటి డ్రైవర్లకు ప్రత్యేక కోడ్‌లను ఇచ్చేందుకు తమ మంత్రిత్వశాఖ సిద్ధమవుతోందని అన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో బాధితులను రక్షించేందుకు వేగంగా స్పందించడం, లేటెస్ట్ ఎక్విప్ మెంట్ వాడకం గురించి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.

What's Your Reaction?