NTR Devara 1 : అదిరిపోయే స్టెప్పులతో దేవర నుంచి మరో సాంగ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కు టైమ్ వచ్చింది. మూవీ విజయంపై టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సెప్టెంబర్ 27న సినిమా విడుదల కాబోతోంది. ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యి ఉండాలి. లేదా ప్రమోషనల్ గా యూజ్ అయ్యే కంటెంట్ సినిమా నుంచి వచ్చి ఉండాలి. కానీ ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలనుకుంటోంది దేవర టీమ్. ఈ మేరకు వినాయక చవితి నుంచి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయబోతున్నారని టాక్.వినాయక చవితి సందర్భంగా దేవర నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటలో అద్భుతమైన స్టెప్పులతో ఎన్టీఆర్ అదరగొట్టాడని టాక్. ఈ విషయాన్ని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పాటను తనే రాశాడట. ఎన్టీఆర్ స్టెప్పులు ఓ రేంజ్ లో ఉన్నాయని.. చెబుతూనే ఈ సాంగ్ రిలీజ్ టైమ్ గురించి హింట్ ఇచ్చాడు. అయితే వినాయక చవితికి ఈ పాటను విడుదల చేసి ఆ తర్వాత ఎక్కువ టైమ్ తీసుకోకుండానే ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. రిలీజ్ ముందు మరో ట్రైలర్ కూడా వస్తుందని టాక్. ట్రైలర్ వస్తే దేవర రేంజ్ ఏంటో ఒక అంచనాకు రావొచ్చు. ఆ అంచనాలకు కూడా అందకుండా ఈ ట్రైలర్ ఉంటుందని ఇన్ సైడ్ టాక్. మొత్తంగా మూడో పాటతో ఎన్టీఆర్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయం అంటున్నారు. అదేదో ఈ లిరికల్ సాంగ్ లో కూడా ఓ మాంచి స్టెప్పులు ఉండేలా చూసుకుంటే ప్రమోషన్స్ కు బాగా యూజ్ అవుతుందేమో కదా..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కు టైమ్ వచ్చింది. మూవీ విజయంపై టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సెప్టెంబర్ 27న సినిమా విడుదల కాబోతోంది. ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యి ఉండాలి. లేదా ప్రమోషనల్ గా యూజ్ అయ్యే కంటెంట్ సినిమా నుంచి వచ్చి ఉండాలి. కానీ ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలనుకుంటోంది దేవర టీమ్. ఈ మేరకు వినాయక చవితి నుంచి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయబోతున్నారని టాక్.
వినాయక చవితి సందర్భంగా దేవర నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటలో అద్భుతమైన స్టెప్పులతో ఎన్టీఆర్ అదరగొట్టాడని టాక్. ఈ విషయాన్ని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పాటను తనే రాశాడట. ఎన్టీఆర్ స్టెప్పులు ఓ రేంజ్ లో ఉన్నాయని.. చెబుతూనే ఈ సాంగ్ రిలీజ్ టైమ్ గురించి హింట్ ఇచ్చాడు. అయితే వినాయక చవితికి ఈ పాటను విడుదల చేసి ఆ తర్వాత ఎక్కువ టైమ్ తీసుకోకుండానే ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. రిలీజ్ ముందు మరో ట్రైలర్ కూడా వస్తుందని టాక్. ట్రైలర్ వస్తే దేవర రేంజ్ ఏంటో ఒక అంచనాకు రావొచ్చు. ఆ అంచనాలకు కూడా అందకుండా ఈ ట్రైలర్ ఉంటుందని ఇన్ సైడ్ టాక్. మొత్తంగా మూడో పాటతో ఎన్టీఆర్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయం అంటున్నారు. అదేదో ఈ లిరికల్ సాంగ్ లో కూడా ఓ మాంచి స్టెప్పులు ఉండేలా చూసుకుంటే ప్రమోషన్స్ కు బాగా యూజ్ అవుతుందేమో కదా..
What's Your Reaction?