NTR Devara : అర్థరాత్రి నుంచే దేవర అరాచకం
యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా దేవర. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రెండు భాగాలుగా వస్తోంది. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు. మామూలుగా ఎన్టీఆర్ కు 9 అంకె ఓ సెంటిమెంట్ గా చెబుతారు. ఆయన కార్ నంబర్స్ కూడా అన్నీ 9లే ఉంటాయి. అందుకే 27 డేట్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక ఈ మూవీపై ఇప్పటి వరకూ పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం చాలా వేగంగా పూర్తవుతోంది. డబ్బింగ్ కూడా స్టార్ట్ అయింది. వచ్చే వారంలో ఎన్టీఆర్ కూడా అన్ని భాషల్లోనూ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. ఇందుకోసం ఎన్ని రోజులు తీసుకుంటాడో కానీ లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.దేవర సినిమా బెన్ ఫిట్ షోస్ ఉంటాయి కదా. వాటికి సంబంధించిన ముహూర్తం కూడా సెట్ అయింది. అర్థరాత్రి 1 : 08 నిమిషాలకు మొదటి షో పడిపోతుందని చెబుతున్నారు. అంటే అర్థరాత్రి నుంచి దేవర అరాచకం మొదలైపోతుందన్నమాట. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం ఆ టైమ్ లో చూసేది మ్యాక్సిమం ఫ్యాన్సే కాబట్టి.. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఇక ఈ మూవీలో ఎన్టీర్ కు విలన్ గా సైఫ్ అలీఖాన్ నటించాడు. సినిమా చివర్లో యానిమల్ విలన్ బాబీ డియోల్ ఎంట్రీ కూడా ఉంటుందని టాక్. అతని పార్ట్ సెకండ్ హాఫ్ లో ఉంటుందట. వీరితో పాటు శ్రుతి మరాతే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ షైన్ టామ్ చాకో ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మొత్తంగా దేవర 1 తో ఎన్టీఆర్.. ప్యాన్ ఇండియా స్థాయిలో సోలోగా సత్తా చాటాలని ఆరాటపడుతున్నాడు. మరి అతని కోరికను ఈ మూవీ నెరవేరుస్తుందా లేదా అనేది ఆ రోజు అర్థరాత్రే తేలిపోతుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా దేవర. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రెండు భాగాలుగా వస్తోంది. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు. మామూలుగా ఎన్టీఆర్ కు 9 అంకె ఓ సెంటిమెంట్ గా చెబుతారు. ఆయన కార్ నంబర్స్ కూడా అన్నీ 9లే ఉంటాయి. అందుకే 27 డేట్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక ఈ మూవీపై ఇప్పటి వరకూ పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం చాలా వేగంగా పూర్తవుతోంది. డబ్బింగ్ కూడా స్టార్ట్ అయింది. వచ్చే వారంలో ఎన్టీఆర్ కూడా అన్ని భాషల్లోనూ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. ఇందుకోసం ఎన్ని రోజులు తీసుకుంటాడో కానీ లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
దేవర సినిమా బెన్ ఫిట్ షోస్ ఉంటాయి కదా. వాటికి సంబంధించిన ముహూర్తం కూడా సెట్ అయింది. అర్థరాత్రి 1 : 08 నిమిషాలకు మొదటి షో పడిపోతుందని చెబుతున్నారు. అంటే అర్థరాత్రి నుంచి దేవర అరాచకం మొదలైపోతుందన్నమాట. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం ఆ టైమ్ లో చూసేది మ్యాక్సిమం ఫ్యాన్సే కాబట్టి.. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ టాక్ స్ప్రెడ్ అవుతుంది.
ఇక ఈ మూవీలో ఎన్టీర్ కు విలన్ గా సైఫ్ అలీఖాన్ నటించాడు. సినిమా చివర్లో యానిమల్ విలన్ బాబీ డియోల్ ఎంట్రీ కూడా ఉంటుందని టాక్. అతని పార్ట్ సెకండ్ హాఫ్ లో ఉంటుందట. వీరితో పాటు శ్రుతి మరాతే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ షైన్ టామ్ చాకో ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మొత్తంగా దేవర 1 తో ఎన్టీఆర్.. ప్యాన్ ఇండియా స్థాయిలో సోలోగా సత్తా చాటాలని ఆరాటపడుతున్నాడు. మరి అతని కోరికను ఈ మూవీ నెరవేరుస్తుందా లేదా అనేది ఆ రోజు అర్థరాత్రే తేలిపోతుంది.
What's Your Reaction?