ఒంగోలు న్యూస్: టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్య..
ఒంగోలు న్యూస్: టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్య..

ఒంగోలు న్యూస్: టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని దుండుగులు దారుణంగా హత్యచేశారు. పద్మ టవర్స్‌లోని తన ఆఫీసులో వీరయ్య చౌదరి ఉన్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ముసుగులు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు కత్తులతో ఆయనపై దాడి చేశారు.
ఈ ఘటనలో వీరయ్య చౌదరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి వీరయ్య చౌదరిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలిని పరిశీలించారు. వీరయ్య చౌదరి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
What's Your Reaction?






