Pakistan: పాకిస్థాన్లో వేర్పాటువాదుల మారణకాండ
కాల్పుల్లో దాదాపు 70 మంది ప్రజలు మృతి..
పాకిస్థాన్ దేశంలో వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సాయుధ బలగాలు మారణకాండ సృష్టించాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లు, రైల్వే ట్రాకులు, వాహనాలపై కాల్పులకు పాల్పడి దాదాపు 70 మందిని హత మార్చాయి. ఇందుకు తమదే బాధ్యతని ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్ ప్రభుత్వ, భద్రత అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మొత్తం నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారు జామున సాయుధులు కాల్పులకు తెగబడ్డారు అని చెప్పుకొచ్చారు.
కాగా, ఈ దాడుల్లో దాదాపు 70 మంది మరణించారని వెల్లడించారు. మొదటి ఘటన ముసాఖేల్ జిల్లాలోని రరాషమ్‌లో ఆదివారం రాత్రి జరగింది.. ఇక్కడ పంజాబ్ ప్రావిన్స్ నుంచి వస్తున్న బస్సులను 10 మంది సాయుధులు ఆపి అందులోని ప్రయాణికులను కిందకు దించి.. వారి గుర్తింపు పత్రాలను తనిఖీ చేసి 23 మందిని కాల్చి చంపేశారు.. ఆ తర్వాత మరో ఘటనలో కలత్ ప్రాంతంలో ఐదుగురు పౌరులు సహా ఆరుగురు భద్రతా సిబ్బందిపై ఈ వేర్పాటువాదులు కాల్పులు జరిపి చంపారు. బలూచిస్థాన్ గిరిజన నాయకుడు నవాబ్ అక్బర్‌ఖాన్ బుగ్టీ వర్ధంతి సందర్భంగా ఈ దాడులు కొనసాగాయి. బొలాన్ జిల్లా కొల్పూర్‌లో జరిగిన దాడిలో మరో నలుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. వేర్పాటువాదుల దాడులను పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు.. సాయుధులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
What's Your Reaction?