Pakistan: బస్సుపై ఉగ్రదాడి.. 23 మంది ప్రయాణీకులు మృతి..
పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లోని ముసాఖేల్‌లోని రరాషమ్ జిల్లాలో అంతర్-ప్రాంతీయ రహదారిని ఉగ్రవాదులు అడ్డుకుని బస్సుపై కాల్పులు జరిపారు.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో సోమవారం ఉదయం ఉగ్రవాదులు జరిపిన దాడిలో కనీసం 23 మంది మరణించారు. ఈ ఘటన బలూచిస్థాన్‌లోని ముసాఖెల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ప్రయాణికులను బలవంతంగా బస్సు నుంచి దించారని, వారి గుర్తింపును పరిశీలించిన తర్వాత కాల్చిచంపారని ఓ అధికారి తెలిపారు.
ముసాఖేల్‌లోని రరాషమ్ జిల్లాలో అంతర్-ప్రాంతీయ రహదారిని ఉగ్రవాదులు అడ్డుకుని బస్సుపై కాల్పులు జరిపారని అసిస్టెంట్ కమిషనర్ ముసాఖైల్ నజీబ్ తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
మృతులు పంజాబ్‌కు చెందిన వారని డాన్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఏ గ్రూపు ప్రకటించలేదు. ఉగ్రవాదులు 10 వాహనాలకు నిప్పుపెట్టారని తెలిపారు. ఈ ఘటనను ఖండిస్తూ బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి, సంతాపం తెలిపారు.
"ఉగ్రవాదుల క్రూరత్వం" అని పాక్ ఫెడరల్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అత్తావుల్లా తరార్ అన్నారు. "ముసాఖైల్ సమీపంలో అమాయక ప్రయాణీకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు క్రూరత్వం ప్రదర్శించారు. ఉగ్రవాదులు తప్పించుకోలేరని అన్నారు.
పాకిస్థాన్ పంజాబ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి అజ్మా బుఖారీ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసాఖేల్ దాడి హింసాకాండను కలవరపరిచే పద్ధతిని అనుసరిస్తుంది అని అన్నారు.
What's Your Reaction?