Paris Paralympics : ప్యారిస్‌లో పారాలింపిక్స్‌ సందడి.. వీరిపైనే మన ఆశలు

పారాలింపిక్స్‌కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఈ క్రీడలు స్టార్ట్ కానున్నాయి. మొన్నటి వరకు జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌ క్రీడలను ఘనంగా నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పారిస్‌ ఇప్పుడు మరోసారి అలరించేందుకు రెడీ అవుతుంది. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ టోర్నీలో వివిధ దేశాల నుంచి మొత్తం 4వేల 400 మంది పారా అథ్లెట్లు 549 పతకాల కోసం పోటీ పడబోతున్నారు. భారత్‌ నుంచి ఒలింపిక్స్ చరిత్రలోనే ఈసారి 84 మంది అథ్లెట్లు రంగంలోకి దిగుతున్నారు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు సహా 19 పతకాలు కొల్లగొట్టిన ఇండియన్ అథ్లెట్లు..ఈసారి అంతకుమించి పతకాలు సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. పారా ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్‌ అంటిల్‌, షాట్ పుటర్ భాగ్యశ్రీ జాదవ్‌ భారత పతాకధారులుగా కనిపించనున్నారు. వీరిద్దరిపై భారత్ భారీ ఆశలే పెట్టుకుంది. పారిస్‌ పారాలింపిక్స్‌లో ఈసారి ఖచ్చితంగా స్వర్ణ పతకం సాధిస్తారన్న వారిలో తెలంగాణ యువ అథ్లెట్‌ జివాంజీ దీప్తి, మరియప్పన్‌ తంగవేలు, డిస్కస్‌త్రో ప్లేయర్ యోగేశ్‌ కథునియా, శీతల్‌ దేవి, కృష్ణ నాగర్‌ ముందు వరుసలో ఉన్నారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన వీరు ఈసారి కూడా అదే ప్రదర్శన కనబర్చాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు.

Aug 28, 2024 - 23:33
 0  1
Paris Paralympics : ప్యారిస్‌లో పారాలింపిక్స్‌ సందడి.. వీరిపైనే మన ఆశలు

పారాలింపిక్స్‌కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఈ క్రీడలు స్టార్ట్ కానున్నాయి. మొన్నటి వరకు జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌ క్రీడలను ఘనంగా నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పారిస్‌ ఇప్పుడు మరోసారి అలరించేందుకు రెడీ అవుతుంది. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ టోర్నీలో వివిధ దేశాల నుంచి మొత్తం 4వేల 400 మంది పారా అథ్లెట్లు 549 పతకాల కోసం పోటీ పడబోతున్నారు.

భారత్‌ నుంచి ఒలింపిక్స్ చరిత్రలోనే ఈసారి 84 మంది అథ్లెట్లు రంగంలోకి దిగుతున్నారు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు సహా 19 పతకాలు కొల్లగొట్టిన ఇండియన్ అథ్లెట్లు..ఈసారి అంతకుమించి పతకాలు సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. పారా ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్‌ అంటిల్‌, షాట్ పుటర్ భాగ్యశ్రీ జాదవ్‌ భారత పతాకధారులుగా కనిపించనున్నారు. వీరిద్దరిపై భారత్ భారీ ఆశలే పెట్టుకుంది.

పారిస్‌ పారాలింపిక్స్‌లో ఈసారి ఖచ్చితంగా స్వర్ణ పతకం సాధిస్తారన్న వారిలో తెలంగాణ యువ అథ్లెట్‌ జివాంజీ దీప్తి, మరియప్పన్‌ తంగవేలు, డిస్కస్‌త్రో ప్లేయర్ యోగేశ్‌ కథునియా, శీతల్‌ దేవి, కృష్ణ నాగర్‌ ముందు వరుసలో ఉన్నారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన వీరు ఈసారి కూడా అదే ప్రదర్శన కనబర్చాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News