PAWAN: ఏపీ అభివృద్ధిలో పవన్‌ మార్క్‌

శాఖలపై సమీక్షలు, వినూత్న కార్యక్రమాలతో తన మార్క్‌ చూపుతున్న పవన్‌.. ప్రజలు, యువత సహకారంతో ముందుకు...

Aug 26, 2024 - 09:55
Aug 26, 2024 - 09:58
 0  4
PAWAN: ఏపీ అభివృద్ధిలో పవన్‌ మార్క్‌

జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాన్ పాలనలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తనదైన మార్క్ వేస్తున్నారు. అభివృద్ధి దిశగా ఏపీని నడిపే ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ తన బాధ్యతల్ని పర్ ఫెక్ట్ గా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ తనకు కేటయించిన అటవీ , పంచాయతీరాజ్, పర్యావరణ శాఖల విషయంలో తనదైన ముద్ర వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన వేరే విషయాలపై దృష్టి పెట్టకుండా పూర్తిగా తన శాఖ పైనే దృష్టి కేంద్రీకరించారు. ఆ డిఫరెన్స్ ఆయా శాఖల పనితీరులో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో మరింత ముందుకు రాష్ట్రాన్ని తీసుకువెళతామని పవన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఒకేసారి గ్రామసభలు..

పవన్‌కల్యాణ్‌ తన శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి గ్రామ సభల్ని నిర్వహించి రికార్డు సృష్టించేలా చేశారు. తద్వారా గ్రామ సమస్యలను తెలుసుకునేందుకు అవకాశం లభించింది. గ్రామంలోని ప్రజలందరూ భాగస్వాములయ్యేలా చేశారు. సమస్యలను అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చేలా చేశారు. అలాగే ఆగష్టు 15ను పరస్కరించుకుని రాష్ర్టంలోని అన్ని పంచాయతీలకు నిధులు విడుదల చేశారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా వన మహోత్సవానికి సిద్ధమయ్యారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

యువత భాగస్వాములయ్యేలా...

ఏపీలో 30వ తేదిన జరగనున్న వనమహోత్సవంలో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. వారి భాగస్వామం ఉంటే ఎటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలనైనా చేయవచ్చని పవన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి జరిగిన ఎన్నికల్లో జనసేనలో యువత భాగస్వామ్యం వల్లే వందశాతం స్ట్రైక్ రేట్ సాధించడంతో ఆ నమ్మకం అలాగే కొనసాగనుంది. నగర వనాల అభివృద్ధి కోసం ప్రతిగ్రామం, పట్టణం, నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేడుకలా చేయనున్నారు. ఇప్పటికే నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా 11 మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో నూతనంగా వనాలను అభివృద్ధిచేయనున్నారు. రాష్ట్రంలో పస్త్రుతం 50 నగర వనాల అభివృద్ధికి చకచకా పనులు కొనసాగుతున్నాయి. వీటిని వేగంగా పూర్తి చేయనున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News