Pawan Kalyan O.G Update :పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు సాలిడ్ అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బాగా బిజీ అయిపోయాడు. డిప్యూటీ సిఎమ్ తో పాటు నాలుగు మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి కాబట్టి రోజంతా తీరిక లేకుండా కనిపిస్తున్నాడు. ఇవి కాక ఆయా శాఖలకు సంబంధంచిన రోజువారీ అప్డేట్స్, జనాలు, అధికారులు, పార్టీ కార్యక్రమాలూ అంటూ నిత్యం బిజీగానే కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఆల్రెడీ కొంత వరకూ పూర్తి చేసిన సినిమాల సంగతేంటీ అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. రీసెంట్ గా హరిహర వీరమల్లుతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నిర్మాతలు కూడా ఆయన్ని కలిశారు. వీటి కంటే కూడా ఫ్యాన్స్ ‘ఓ.జి’ గురించిన అప్డేట్స్ కోసం చూస్తున్నారు. వారి కోసమే ఈ న్యూస్.ఓజిని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ముంబై అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో పవన్ కళ్యాణ్ ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూపించబోతున్నాడు సుజిత్. ఈ కథ నచ్చడంతో దీనికంటే ముందే కమిట్ అయిన సినిమాల డేట్స్ కూడా ఓజీకే ఇచ్చాడు పవన్. సుజిత్ కూడా చాలా వేగంగా షూటింగ్ చేశారు. మరో 195 - 20 రోజుల డేట్స్ ఇస్తే సినిమా పూర్తవుతుందట. అందుకే ఆ డేట్స్ కోసమే ఎదురుచూస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కరుణించాడు అని కన్ఫార్మ్ అయింది. ఓజి కోసం ఓ పదిహేను రోజులు టైమ్ ఇచ్చాడట పవన్. సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకూ డేట్స్ కేటాయించాడట. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ షూటింగ్ కోసం ఎక్కడికీ రాడు. మొత్తం యూనిట్ అంతా విజయవాడకు వెళ్లాలి. అంటే మిగతా పార్ట్ అంతా విజయవాడలోనే మొత్తం కంప్లీట్ చేయబోతున్నారు. అన్నీ కుదిరితే ఫిబ్రవరి లేదా మార్చిలోనే సినిమా విడుదలవుతుందని కూడా అంటున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లా చూడాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరబోతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బాగా బిజీ అయిపోయాడు. డిప్యూటీ సిఎమ్ తో పాటు నాలుగు మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి కాబట్టి రోజంతా తీరిక లేకుండా కనిపిస్తున్నాడు. ఇవి కాక ఆయా శాఖలకు సంబంధంచిన రోజువారీ అప్డేట్స్, జనాలు, అధికారులు, పార్టీ కార్యక్రమాలూ అంటూ నిత్యం బిజీగానే కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఆల్రెడీ కొంత వరకూ పూర్తి చేసిన సినిమాల సంగతేంటీ అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. రీసెంట్ గా హరిహర వీరమల్లుతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నిర్మాతలు కూడా ఆయన్ని కలిశారు. వీటి కంటే కూడా ఫ్యాన్స్ ‘ఓ.జి’ గురించిన అప్డేట్స్ కోసం చూస్తున్నారు. వారి కోసమే ఈ న్యూస్.
ఓజిని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ముంబై అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో పవన్ కళ్యాణ్ ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూపించబోతున్నాడు సుజిత్. ఈ కథ నచ్చడంతో దీనికంటే ముందే కమిట్ అయిన సినిమాల డేట్స్ కూడా ఓజీకే ఇచ్చాడు పవన్. సుజిత్ కూడా చాలా వేగంగా షూటింగ్ చేశారు. మరో 195 - 20 రోజుల డేట్స్ ఇస్తే సినిమా పూర్తవుతుందట. అందుకే ఆ డేట్స్ కోసమే ఎదురుచూస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కరుణించాడు అని కన్ఫార్మ్ అయింది.
ఓజి కోసం ఓ పదిహేను రోజులు టైమ్ ఇచ్చాడట పవన్. సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకూ డేట్స్ కేటాయించాడట. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ షూటింగ్ కోసం ఎక్కడికీ రాడు. మొత్తం యూనిట్ అంతా విజయవాడకు వెళ్లాలి. అంటే మిగతా పార్ట్ అంతా విజయవాడలోనే మొత్తం కంప్లీట్ చేయబోతున్నారు. అన్నీ కుదిరితే ఫిబ్రవరి లేదా మార్చిలోనే సినిమా విడుదలవుతుందని కూడా అంటున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లా చూడాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరబోతోంది.
What's Your Reaction?