Pawan Kalyan : పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం దిశగా అడుగులు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అందులో భాగంగా దేశంలో ఎప్పుడూ లేని విధంగా రేపు 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 87 రకాల పనుల కోసం ₹4,500 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ఆ పనులకు సంబంధించి గ్రామ సభల్లో తీర్మానాలు చేస్తామని పేర్కొన్నారు. 9 కోట్ల ఉపాధి దినాలతో 54 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. చాయతీలను స్వయంశక్తి పంచాయతీలుగా మార్చేలా సంస్కరణలు తీసుకొస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ కింద రూ.40,579 కోట్ల పనులు జరిగాయి. కానీ దాని ఫలితాలు క్షేత్రస్థాయిలో నామమాత్రంగా ఉన్నాయి. 2014-19 మధ్య గ్రామాల నుంచి పన్నుల రూపంలో రూ.240-270 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ YCP హయాంలో రూ.170 కోట్లే వచ్చింది. పన్నులు వసూలు చేయడం మానేశారో? ఏం చేశారో తెలియదు’ అని పేర్కొన్నారు.

What's Your Reaction?