PCB | రావల్పిండిలో ఓటమిపై పీసీబీ గుర్రు.. చిన్న సర్జరీ సరిపోదట..!
PCB : బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో చిత్తుగా ఓడిన పాకిస్థాన్(Pakistna) జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రావల్పిండి టెస్టు (Rawalpindi Test)లో ఓటమిపై ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) మీడియా వేదికగా గట్టిగానే స్పందించాడు.
PCB : బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో చిత్తుగా ఓడిన పాకిస్థాన్(Pakistna) జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విఫలమైన పాక్ ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. రావల్పిండి టెస్టు (Rawalpindi Test)లో ఓటమిపై ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) మీడియా వేదికగా గట్టిగానే స్పందించాడు. పాకిస్థాన్ క్రికెట్ గాడిలో పడాలంటే చిన్న సర్జరీ సరిపోదని, పెద్ద మరమ్మతు చేయాల్సి ఉందని నఖ్వీ అభిప్రాయపడ్డాడు.
‘పాకిస్థాన్ క్రికెట్‌లో నెలకొన్న సమస్యలను నేను పరిష్కరిస్తాను. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. జట్టులో భారీ మార్పులు చేయబోతున్నాం. పాక్ జట్టుకు మొదట్లో నేను చిన్న సర్జరీ అవసరం అనుకున్నా. కానీ, బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆటగాళ్ల చెత్త ప్రదర్శన చూశాక పెద్ద మార్పులే చేయాల్సిన అవసరం ఉందని అర్ధమైంది’ అని నఖ్వీ వెల్లడించాడు. అయితే మాజీ ఆటగాళ్లు రమిజ్ రాజా, మహ్మద్ హఫీజ్‌లు పాకిస్థాన్ జట్టుకు చచ్చేంత వరకూ సర్జరీ జరుగుతూనే ఉండాలి అంటూ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.
PCB Chairman Mohsin Naqvi’s press conference at Gaddafi Stadium, Lahore
Tags:
What's Your Reaction?