PM Modi : మహిళలపై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టం : మోదీ
మహిళలపై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.ఆదివారం మహారాష్ట్రలోని లఖ్‌పతి దీదీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షపడేలా చేస్తామన్నారు. ఇందుకోసం కఠిన చట్టాలను మరింత పటిష్ఠపరుస్తున్నామని చెప్పారు. కోల్‌కతా వైద్య విద్యార్థిని హత్యాచారం, బద్లాపుర్ పాఠశాలలో లైంగిక వేధింపుల ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రధానమంత్రి స్పందించారు.‘మహిళల భద్రత ఎంతో ముఖ్యమైనది. మహిళలపై నేరాలు క్షమించరానివని ప్రతి రాష్ట్రానికి చెబుతున్నా. నేరస్థులు ఎవ్వరైనా సరే.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా శిక్షించేందుకు చట్టాలను మరింత పటిష్ఠపరుస్తున్నాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.2014 వరకు స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.25వేల కోట్ల కంటే తక్కువే ఇచ్చారని ప్రధాని మోదీ తెలిపారు. కానీ, గత పదేళ్లలో రూ.9లక్షల కోట్లు ఇచ్చామన్నారు. ‘లఖ్‌పతి దీదీ కార్యక్రమం కేవలం మహిళల ఆదాయాన్ని పెంచడమే కాకుండా భవిష్యత్ తరాలను శక్తివంతం చేసేందుకు ఉద్దేశించింది’ అని మోదీ పేర్కొన్నారు. 4.3లక్షల స్వయంసహాయక సంఘాల్లోని 48లక్షల మంది లబ్ధిదారుల కోసం రూ.2500 కోట్ల నిధులను ఆయన విడుదల చేశారు.ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకోవడంలో మహిళలలది కీలక పాత్ర అని మోదీ వెల్లడించారు. కుటుంబ శ్రేయస్సు కోసం మహిళగా ఎంతో తోడ్పాటును అందించినా వారికి తగిన సహాయం లభించదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే మహిళల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం ఏటా ప్రయత్నాలు చేస్తోందని, ఈ క్రమంలో 3 కోట్ల మంది సోదరీమణులను లక్షాధికారులను చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామన్నారు. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల్లో పనిచేసే వారి వార్షిక ఆదాయం రూ.లక్ష దాటుతుందని ప్రధాని పేర్కొన్నారు.
మహిళలపై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.ఆదివారం మహారాష్ట్రలోని లఖ్‌పతి దీదీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షపడేలా చేస్తామన్నారు. ఇందుకోసం కఠిన చట్టాలను మరింత పటిష్ఠపరుస్తున్నామని చెప్పారు. కోల్‌కతా వైద్య విద్యార్థిని హత్యాచారం, బద్లాపుర్ పాఠశాలలో లైంగిక వేధింపుల ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రధానమంత్రి స్పందించారు.‘మహిళల భద్రత ఎంతో ముఖ్యమైనది. మహిళలపై నేరాలు క్షమించరానివని ప్రతి రాష్ట్రానికి చెబుతున్నా. నేరస్థులు ఎవ్వరైనా సరే.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా శిక్షించేందుకు చట్టాలను మరింత పటిష్ఠపరుస్తున్నాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
2014 వరకు స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.25వేల కోట్ల కంటే తక్కువే ఇచ్చారని ప్రధాని మోదీ తెలిపారు. కానీ, గత పదేళ్లలో రూ.9లక్షల కోట్లు ఇచ్చామన్నారు. ‘లఖ్‌పతి దీదీ కార్యక్రమం కేవలం మహిళల ఆదాయాన్ని పెంచడమే కాకుండా భవిష్యత్ తరాలను శక్తివంతం చేసేందుకు ఉద్దేశించింది’ అని మోదీ పేర్కొన్నారు. 4.3లక్షల స్వయంసహాయక సంఘాల్లోని 48లక్షల మంది లబ్ధిదారుల కోసం రూ.2500 కోట్ల నిధులను ఆయన విడుదల చేశారు.ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకోవడంలో మహిళలలది కీలక పాత్ర అని మోదీ వెల్లడించారు. కుటుంబ శ్రేయస్సు కోసం మహిళగా ఎంతో తోడ్పాటును అందించినా వారికి తగిన సహాయం లభించదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే మహిళల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం ఏటా ప్రయత్నాలు చేస్తోందని, ఈ క్రమంలో 3 కోట్ల మంది సోదరీమణులను లక్షాధికారులను చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామన్నారు. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల్లో పనిచేసే వారి వార్షిక ఆదాయం రూ.లక్ష దాటుతుందని ప్రధాని పేర్కొన్నారు.
What's Your Reaction?