PM Modi: ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోడీ .. ఘనంగా స్వాగతం
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించనున్న మోడీ
రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్ల తర్వాత ప్రధాని మోడీ ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. మోడీ గురువారం రాత్రి పోలాండ్ నుండి బయలుదేరాడు. 10 గంటల రైలు ప్రయాణం తర్వాత వారు ఉక్రెయిన్ చేరుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ప్రధాని మోదీ 7 గంటలపాటు గడపనున్నారు. ఇకపోతే, ఉక్రెయిన్ లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కారణంగా ఉక్రెయిన్ ఏర్పడినప్పటి నుండి ఏ భారత ప్రధాని కూడా అక్కడ పర్యటించలేదు. 24 ఫిబ్రవరి 2022న రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసినప్పటి నుండి NATO దేశాలు తప్ప మరే ఇతర దేశానికి చెందిన నాయకుడు ఉక్రెయిన్‌ను సందర్శించలేదు. కాబట్టి., ప్రధాని మోదీ ఈ పర్యటన కూడా ప్రత్యేకమైనది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొన్ని నెలల క్రితం ఉక్రెయిన్ లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించారు. అంతకుముందు, 2023 మే నెలలో జపాన్ లో జరిగిన G-7 శిఖరాగ్ర సమావేశంలో యుద్ధం తర్వాత మోడీ, జెలెన్స్కీ మొదటిసారి కలుసుకున్నారు. కీవ్ చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ హయత్ రీజెన్సీ హోటల్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఉన్న భారతీయ ప్రవాసులతో ఆయన సమావేశమవుతారు.
What's Your Reaction?